బొగ్గు గనుల వేలంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ కరోనా సంక్షోభాన్ని భారత్​ అవకాశంగా మలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని ఈ విపత్తు గుర్తుచేసిందని అన్నారు. వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు మోదీ.   వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసగించిన మోదీ.. విద్యుత్​ రంగంలో భారత్​ను స్వయం సమృద్ధి సాధించే దిశగా బొగ్గు గనుల వేలం కీలక నిర్ణయమని అభిప్రాయపడ్డారు.  


Comments