కరోనా వేళ జిల్లాలోని ప్రతీ పోలీసు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి ~జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు,IPS గారు * కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లను జిల్లా ఎస్పీ గారు ఆకస్మిక తనిఖీ * కరోనా వేళ... గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది కోసం తీసుకున్న సేఫ్టీ చర్యలుపై ఆరా కరోనా వైరస్ నియంత్రణ పోరాటంలో పోలీసు సిబ్బంది ముందు వరసలో ఉండి పోరాడుతున్నారు. ఈక్రమంలో జిల్లాలో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు. ఆతరహా ఘటనలు జిల్లాలో పునరావృతం కారాదు. మనల్ని నమ్ముకున్న భార్యాపిల్లలు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. మన నుండీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడరాదు. ఇటు మనం... అటు కుటుంబ సభ్యులు తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రస్తుత తరుణంలో స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతీ ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు గారు పోలీసు సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా... కళ్యాణదుర్గం రూరల్ ఆతర్వాత కళ్యాణదుర్గం అర్బన్ , రూరల్ సర్కిల్ కార్యాలయం, సబ్ డివిజన్ కార్యాలయం, మరియు కుందిర్పి పోలీసు స్టేషన్లను సందర్శించి అక్కడి సిబ్బంది ఆయా అధికారులతో ముఖాముఖిగా మాట్లాడారు. కరోనా వేళ... సిబ్బంది కోసం తీసుకున్న సేఫ్టీ చర్యలుపై ఆరా తీశారు. మాస్కులు, గ్లవుజులు, ఫేస్ షీల్డు ధరించారా లేదా... శ్యానిటైజర్ వినియోగించడం, సామాజిక దూరం పాటించడంపై అడిగి తెలుసుకున్నారు. సురక్షిత ఉపకరణలు సక్రమంగా సిబ్బందికి చేరాయా లేదా... వయస్సు ఆధారంగా విధులు కేటాయించారా... వివిధ సమస్యలుతో పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రిసెప్సన్ సెంటర్లను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలీసు సిబ్బంది సేఫ్టీ కోసం తీసుకున్న చర్యలను ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో సమీక్షించారు. జిల్లా ఎస్పీతో పాటు కళ్యాణదుర్గం డీఎస్పీ ఎం.వెంకటరమణ, కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ శివశంకర్ నాయక్ , ఎస్సైలు సుధాకర్ , ఆశాబేగం, నాగన్న, తదితరులు వెళ్లారు.


Comments