కార్యాలయానికి హాజరుకాని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ :అనంతపురం జిల్లా హిందూపురం లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి రోజు నుండి ఈరోజు వరకు తమ కార్యాలయానికి విధులకు హాజరు కాని హిందూపురం జిల్లా రిజిస్టర్ ఆఫీస్ అధికారిని ఉమామహేశ్వరి.జనతా కర్ఫ్యూ ప్రారంభం అయిన రోజు నుండి నేటి వరకు విధులకు హాజరు కాలేదు ప్రభుత్వం నుండి స్పష్టమైన విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన హిందూపురం డిస్టిక్ రిజిస్టర్ ఉమా మహేశ్వరి కి మాత్రం వర్తించదు ఉన్నట్టు ఉన్నారు. కార్యాలయానికి హాజరు కాకపోవడానికి గల కారణాలు కారణాలు తెలుసుకుందామని కార్యాలయా సంప్రదించగా మేడం గారు ఇంటి దగ్గర నుండే విధులు నిర్వహిస్తున్నారని, కర్నూలు ప్రాంతం రెడ్ జోన్ కావడం వల్ల విధులకు హాజరు కాలేకపోతున్నారని సమాధానం.లాక్ డౌన్ కారణంగా అనేక సమస్యలతో ప్రజలు సతమత పడుతున్న ప్రభుత్వ అధికారులకు మాత్రం చీమకుట్టినట్టు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు వాపోతున్నారు. డీఐజీకి ఫోన్ లో సంప్రదించగా....డిస్టిక్ రిజిస్టర్ అధికారి హాజరు కాలేకపోవడం మా దృష్టికి రాలేదని మీరు చెప్పిన తర్వాత మాకు విషయంతెలిసిందని,ఆఫీసులోనే ఉన్నానని తమకు మూడుసార్లు మాట్లాడారని తెలిపారు.విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు.


Comments