*20.11.2020* *కర్నూలు జిల్లా* *శుక్రవారం మధ్యాహ్నం 1.21ని.లకు దేవగురువు బృహస్పతి మకరరాశి లోకి ప్రవేశించడం.. అలాగే పుష్కరుని ప్రవేశంతో తుంగభద్ర నదికి మొదలైన పుష్కరాలు.* *నేటి(20.11.20) నుంచి 1.12.20వరకు 12 రోజులపాటు జరుగనున్న తుంగభద్ర నదీ పుష్కర ఉత్సవాలు.* *శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కర్నూలు జిల్లా కేంద్రంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.* *సంకల్ భాగ్ పుష్కర ఘాట్ లో సాంప్రదాయ పద్ధతిలో,శాస్త్రోక్తంగా పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.* *ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిన సంకల్ బాగ్ పుష్కర ఘాట్.* *శోభాయమానంతో కన్నులపండుగగా జరిగిన పుష్కర ప్రారంభోత్సవం.* *కర్నూలు.* శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కర్నూలు జిల్లా కేంద్రంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాంప్రదాయ పద్ధతిలో,శాస్త్రోక్తంగా పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలను ప్రారంభించారు. సంప్రదాయ పంచె కట్టు దుస్తులను ధరించి, పాద రక్షలు లేకుండా తుంగభద్ర నదీ మాతకు పూలు సమర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌, పట్టువస్త్రాలను పట్టుకుని నది వరకు నడిచి వెళ్లి తుంగభద్ర పుష్కరుడుకి పూజలు నిర్వహించారు. అనంతరం గంగ పూజ నిర్వహించిన సీఎం పట్టువస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను పుష్కరుడుకి సమర్పించి , రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని సంకల్పించారు. వేదమంత్రాలతో పండితులు తుంగభద్ర నదిలోకి పుష్కరుని ఆహ్వానిస్తుండగా..ముఖ్యమంత్రి స్వాగత పూజ నిర్వహించారు. పుష్కరకాల ప్రవేశానంతరం నదీజలానికి పండితులు విశేషమైన ఉపచార పూజలు నిర్వహించగా, నది దేవతకు ప్రీతిగా పసుపు, కుంకుమలతో పూజ చేసి భక్తి శ్రద్ధలతో తుంగభద్ర నదికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు తుంగభద్రానదికి పంచహారతులు ఇచ్చారు. అనంతరం విశేషమైన పుష్కర జలాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ శిరస్సుపై ప్రోక్షించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా అక్కడ నిర్మించిన ప్రత్యేక యాగశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి యాగశాల నాలుగు మూలలో ఉన్న వాస్తు మండపం, సర్వతోభద్ర మండపం, యోగిని మండపం, నవగ్రహ మండపం వద్ద అప్పటికే ఆవాహన చేసిన కళశాలకు పుష్పాలు సమర్పించారు. వేదపండితుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆయుఃస్సు హోమానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పూర్ణ ఫలాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా యాగశాలలో పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో చివరగా పుష్కర యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, శంకరనారాయణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ సెక్రటరీ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, స్పెషల్ కమీషనర్ అర్జున్ రావ్ తదితరులు పాల్గొన్నారు.


*కర్నూలు జిల్లా*


*శుక్రవారం మధ్యాహ్నం 1.21ని.లకు  దేవగురువు బృహస్పతి మకరరాశి లోకి ప్రవేశించడం.. అలాగే పుష్కరుని ప్రవేశంతో తుంగభద్ర నదికి మొదలైన పుష్కరాలు.* 


*నేటి(20.11.20) నుంచి 1.12.20వరకు 12 రోజులపాటు జరుగనున్న తుంగభద్ర నదీ పుష్కర ఉత్సవాలు.*

*శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కర్నూలు జిల్లా కేంద్రంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.*

*సంకల్ భాగ్ పుష్కర ఘాట్ లో సాంప్రదాయ పద్ధతిలో,శాస్త్రోక్తంగా   పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.* 

*ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిన సంకల్ బాగ్ పుష్కర ఘాట్.*

*శోభాయమానంతో కన్నులపండుగగా జరిగిన పుష్కర ప్రారంభోత్సవం.*


*కర్నూలు.*


శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కర్నూలు జిల్లా కేంద్రంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

సాంప్రదాయ పద్ధతిలో,శాస్త్రోక్తంగా   పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలను ప్రారంభించారు. 

సంప్రదాయ పంచె కట్టు దుస్తులను ధరించి, పాద రక్షలు లేకుండా తుంగభద్ర నదీ మాతకు పూలు సమర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌,  పట్టువస్త్రాలను పట్టుకుని నది వరకు నడిచి వెళ్లి  తుంగభద్ర పుష్కరుడుకి పూజలు నిర్వహించారు.

అనంతరం గంగ పూజ నిర్వహించిన సీఎం పట్టువస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను పుష్కరుడుకి సమర్పించి , రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని సంకల్పించారు.

వేదమంత్రాలతో పండితులు తుంగభద్ర నదిలోకి పుష్కరుని ఆహ్వానిస్తుండగా..ముఖ్యమంత్రి స్వాగత పూజ నిర్వహించారు. 

పుష్కరకాల ప్రవేశానంతరం నదీజలానికి  పండితులు విశేషమైన ఉపచార పూజలు నిర్వహించగా, నది దేవతకు ప్రీతిగా పసుపు, కుంకుమలతో పూజ చేసి భక్తి శ్రద్ధలతో తుంగభద్ర నదికి  సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. 

ఈ సందర్భంగా వేదపండితులు తుంగభద్రానదికి పంచహారతులు ఇచ్చారు. 

అనంతరం విశేషమైన పుష్కర జలాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ శిరస్సుపై ప్రోక్షించుకున్నారు. 

కార్యక్రమంలో భాగంగా అక్కడ నిర్మించిన ప్రత్యేక యాగశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి  యాగశాల నాలుగు మూలలో ఉన్న వాస్తు మండపం, సర్వతోభద్ర మండపం, యోగిని మండపం, నవగ్రహ మండపం వద్ద అప్పటికే ఆవాహన చేసిన కళశాలకు పుష్పాలు సమర్పించారు.

వేదపండితుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆయుఃస్సు హోమానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పూర్ణ ఫలాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా  యాగశాలలో పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. 

కార్యక్రమంలో చివరగా పుష్కర యాగశాలలో  వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతిలో పాల్గొన్నారు. 


తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా,  మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, శంకరనారాయణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ సెక్రటరీ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, స్పెషల్ కమీషనర్ అర్జున్ రావ్ తదితరులు పాల్గొన్నారు.