నవంబరు 26న ఆసరా, చేయూత మహిళలకు పాడి పశువుల పంపిణీ
దశల వారీగా కార్యక్రమం అమలు
గొర్రెలు, మేకల పంపిణీకి ప్రణాళిక
పెట్టుబడి కచ్చితంగా గిట్టుబాటు అవ్వాలన్న సీఎం
ఆ మేరకు పాడి పశువుల ఎంపిక
వాటి నుంచి పాల దిగుబడి బాగుండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
మహిళల్లో స్వయం సాధికారత, సుస్థిర ఆర్థికాభివృద్ధికి ఈ కార్యక్రమం
పశువులకు దాణా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలు
అమరావతి:
వైయస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం సమీక్ష
సమావేశంలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయా శాఖలకు చెందిన అధికారులు హాజరు
ఇప్పటి వరకూ ఆవులు, గేదెల కోసం 4.68 లక్షల మహిళల ఆప్షన్
గొర్రెలు, మేకల కోసం 2.49 లక్షల మహిళల ఆప్షన్
ఒక్కో యూనిట్ ధర రూ.75 వేలు, ప్రాజెక్టు విలువ రూ.5,386 కోట్లు
జిల్లాల వారీగా లబ్ధిదారులు, వారికి ఇవ్వనున్న పాడి పశువులు తదితర అంశాలపై నిశితంగా సమీక్షించిన సీఎం, వివరాలు అందించిన అధికారులు
2,11,780 ఆవులు, 2,57,211 గేదెలు, 1,51,671 గొర్రెలు, 97,480 మేకల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక
లబ్ధిదారుకు ఇవ్వనున్న ప్రతి పశువునూ భౌతికంగా తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్) చేయనున్న పశు సంవర్థక శాఖ అధికారులు
లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిధిలో రిజిస్టర్ చేయనున్న అధికారులు
ప్రతి నెలా పశువు అరోగ్యాన్ని పరిశీలించనున్న వైద్యుడు
పాడి పశువుకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయనున్న పశు వైద్యులు
అలాగే పాడి పశువు ఇచ్చే పాల దిగుబడి కూడా నమోదు
నవంబరు 26 నుంచి తొలిదశలో పాడి పశువుల పంపిణీ
వర్చువల్ విధానంలో 4 వేల గ్రామాల్లో పంపిణీని ప్రారంభించనున్న సీఎం
తొలుత ప్రకాశం, వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ
తర్వాత దశల వారీగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక
గొర్రెలు, మేకల పంపిణీకీ ప్రణాళిక సిద్ధం
పెట్టుబడికి కచ్చితంగా గిట్టుబాటు రావాలన్న సీఎం
అందుకనే జాతుల ఎంపికలో జాగ్రత్త వహించాలి
పర్జేజ్ కమిటీ బలంగా ఉండాలి
ఆ కమిటీలో కచ్చితంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు ఉండాలి
బీమా సంస్థ ప్రతినిధితో పాటు, బ్యాంకర్ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలన్న సీఎం
వెటర్నరీ సర్వీసులు కూడా బలోపేతం చేయాలి
ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవాలని సీఎం సూచన
పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్బీకేల పరిధిలో వెంటనే వాటికి వైద్యం అందాలని సీఎం ఆదేశం
ఆ స్థాయిలో అధికారులు సన్నద్ధం కావాలని నిర్దేశం
ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను పశువుల వైద్యానికి వినియోగించుకోవాలని సీఎం ఆదేశం
కాల్ సెంటర్ల ఏర్పాటు, వాటి ద్వారా వైద్యం అందేలా చూడాలన్న సీఎం
పశు దాణా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలన్న సీఎం
పశు దాణాలో రసాయనాలు (కెమికల్స్) లేకుండా చూడాలన్న సీఎం
సహజమైన పదార్థాలతో దాణా తయారయ్యేలా చూడాలన్న సీఎం
రసాయనాలో కలుషితమైన ఆహారం కారణంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయన్న సీఎం
సేంద్రీయ పద్దతులకు పెద్ద పీట వేయాలన్న సీఎం
సేంద్రీయ (ఆర్గానిక్) పాలు, సేంద్రీయ మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
దీని వల్ల మరింత ధర లభించే అవకాశం ఉంటుందన్న సీఎం
సేంద్రీయ పాల బ్రాండ్‌ను మరింత ప్రమోట్ చేయాలన్న సీఎం
దీనిపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలన్న సీఎం
చేయూత, ఆసరా పథకాల కింద గ్రామాల్లో మహిళలు ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాలపై సీఎం సమీక్ష
ఇప్పటి వరకూ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలిపి 78 వేల దుకాణాలు ప్రారంభం అయ్యాయన్న అధికారులు
చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలన్న సీఎం
వారు కూడా సుస్థిర జీవనోపాధి పొందేలా చూడాలని నిర్దేశం
addComments
Post a Comment