*ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర లో లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన సిరిగం విజయలక్ష్మి... గుంటూరు నగరంలోని 44 వ వార్డు లో వంగల వలివీరారెడ్డి నేతృత్వంలో ఈనెల 15వ తేదీన జరిగిన పాదయాత్రలో సిరిగం విజయలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కును స్థానిక శాసనసభ్యులు మద్దాల గిరి,మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం కి అందించడం హర్షణీయం. పాదయాత్ర సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మద్దాల గిరి ప్రసంగిస్తూ వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థలు పేద ప్రజల సమస్యల పరిష్కార అంబాసిడర్ల్ గా పని చేస్తున్నాయని అన్నారు.మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ భారతదేశంలోనే సంక్షేమ ప్రదాతగా ప్రజలలో సుస్థిరస్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పొందిన్నారనారు. దశలవారీగా మద్య నిషేధం అమలు ద్వారా 70 శాతం మద్య వినియోగం తగ్గడం గమనార్హం అన్నారు. గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ప్రసంగిస్తూ పాదయాత్ర తొమ్మిదవ రోజున ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు కావాటి మనోహర్ నాయుడు, వంగళ హేమలత,పోనిగంటి రామకృష్ణారెడ్డి,ఆనం సంజీవరెడ్డి,డా"సి.హెచ్. చక్రపాణి,కృష్ణారెడ్డి,బద్రి వసంత్,నాని,వెంకటప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వలంరెడ్డి లక్ష్మణ రెడ్డి చైర్మన్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9949930670


Comments