జాతీయ ప‌త్రికా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు... ప్ర‌జ‌లు,ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య వార‌ధిగా..స‌మ‌స్య‌ల ప‌రిష్కార సార‌ధిగా మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో మీడియా పోషిస్తున్న పాత్ర ఎన‌లేనిది.ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్ మీడియాల వ‌ల్ల స‌మాచారం మరింత వేగంగా, మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా అంద‌జేస్తూ స‌మాజాభివృద్ధికి జ‌ర్న‌లిస్టులు విశేష కృషి చేస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌త్రికాస్వేచ్ఛ‌, జ‌ర్న‌లిస్టుల హ‌క్కులు, జీతాలు, సౌక‌ర్యాల లోటు వుంది. జాతీయ ప‌త్రికా దినోత్స‌వం సంద‌ర్భంగా మీడియా సోద‌రులంతా సంఘ‌టిత‌మై హ‌క్కులు సాధించుకోవాలి.క‌రోనా వైర‌స్ వ్యాపించిన క్ర‌మంలో ప్రాణాలు ప‌ణంగా పెట్టిన ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తో స‌మానంగా జ‌ర్న‌లిస్టులు ప‌నిచేశారు. కొంత మంది జ‌ర్న‌లిస్టులు త‌మ ప్రాణాలు సైతం కోల్పోయారు.మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంది.నా బాధ్య‌త‌గా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌మాద‌/సాధార‌ణ బీమా చేయించాను.పోరాడి హ‌క్కులు సాధించుకునేందుకు జ‌ర్న‌లిస్టులు చేసే పోరాటాల‌కు తెలుగుదేశం పార్టీ ఎల్ల‌ప్పుడూ మ‌ద్ద‌తుగా నిలుస్తుంది.పాత్రికేయ సోద‌రులంద‌రికీ పేరుపేరునా జాతీయ ప‌త్రికా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకుంటున్నాను. నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి


Comments