శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం.


 

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం.


 తిరుమల‌: (ప్రజా అమరావతి),

             తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.


 ఇందులో భాగంగా యాగశాలలో....

 ఉదయం 9 నుండి 12 గంటల వరకు శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం,

 పూర్ణాహుతి, 

 కలశ ఉద్వాసన, 

 మహాశాంతి అభిషేకం, 

 కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి   

 కలశస్థాపన, 

 విశేష దీపారాధన చేపట్టనున్నారు.


న‌వంబ‌రు 23న‌ శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి హోమం.


 ఈ రోజు న‌వంబ‌రు 23వ తేదీ సోమ‌‌వారం

          శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి హోమం జ‌రుగ‌నుంది.  

         

ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.