తగిన జాగ్రత్తలు తీసుుందాం- వైరస్ తో మరికొంత కాలం కలిసి జీవిద్దాం:డాక్టర్ ఫహీమ్ యూనస్*

 *ఏపీ కోవిడ్-19*

*కమాండ్ కంట్రోల్ రూమ్*


*తగిన జాగ్రత్తలు తీసుుందాం- వైరస్ తో మరికొంత కాలం కలిసి జీవిద్దాం:డాక్టర్ ఫహీమ్ యూనస్*


కోవిడ్-19 వైరస్ మరీ అంత ప్రమాదకరమైనది కాదని.. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ఈ వైరస్ తో కలిసి జీవించడానికి అలవాటుపడాలని *అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్* లో అంటువ్యాదుల విభాగం అధిపతి డాక్టర్ ఫయీమ్ యూనస్ ఇదివరకే వెల్లడించారు. వైరస్ లపై 20ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఆయన ఇచ్చిన సూచనలు ఇవి. 


1. కోవిడ్-19 వైరస్ తో నెలలు లేదా సంవత్సరాలు కలిసి జీవించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కాదనలేము. అలా అని భయాందోళనకు గురై మీ జీవితాలను కష్టంగా మార్చుకోవద్దు. వాస్తవికతతో జీవించడం నేర్చుకుందాం.


2. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను వేడి నీటిని తాగడం ద్వారా నాశనం చేయలేము.  


3. చేతులు శుభ్రం చేసుకోవడం మరియు భౌతిక దూరాన్ని పాటించడం ఉత్తమమైన మరియు సురిక్షితమైన పద్ధతి.


4. మీ ఇంట్లో కోవిడ్-19 వచ్చిన వ్యక్తి లేకపోతే ఇంటిని క్రిమిసంహారకం చేయవలసిన అవసరం లేదు.


5. కిరాణా సంచులు / ప్లాస్టిక్ సంచులు, గ్యాస్ స్టేషన్లు, తోపుడు బండ్లు మరియు ఎటిఎంల వంటి వాటిని ఉపయోగించినపుడు చేతులు శుభ్రంగా కడుక్కోండి.


6. కోవిడ్-19 వైరస్ ఆహారం ద్వారా సంక్రమించదు. ఇది ఫ్లూ వంటి వైరస్ కారకాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆహారాన్ని ఆర్డర్ చేయడం ద్వారా కోవిడ్-19 వ్యాపించే ప్రమాదం లేదు.


7. ఎక్కువగా యాంటీ అలర్జీలు వాడడంవల్ల మరియు వైరల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవడం ద్వారా కూడా మీరు వాసనను కోల్పోయే అవకాశాలు ఉంటాయి.  


8. మీరు ఇంటికి చేరుకున్న తర్వాత వెంటనే బట్టలు మార్చుకోవాల్సిన, శుభ్రంగా స్నానం చేయవలసిన అవసరం లేదు. శుభ్రంగా ఉండడం అనేది మన దైనందిన చర్యల్లో భాగం.  


9. కోవిడ్-19 వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదు. ఇది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్. ఇతరులకు దగ్గరగా ఉండడం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది.  


10. గాలి శుభ్రంగా ఉంటుంది. మీరు పార్కులు మరియు బహిరంగ ప్రదేశాలలో నడవవచ్చు (మీ రక్షణ కోసం తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించండి)


11. కోవిడ్-19 దరిచేరకుండా చేతులు శుభ్రం చేసుకోవడం కోసం ప్రతిరోజూ వాడే సబ్బునే ఉపయోగించండి. యాంటీ బాక్టీరియల్ సబ్బు అవసరం లేదు. ఎందుకంటే ఇవి వైరస్లు, బ్యాక్టీరియా కాదు.


12. మీరు ఆహారాన్ని ఆర్డర్ చేసినవాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే వేడిగా ఉండడం కోసం మైక్రోవేవ్ ను ఉపయోగించవచ్చు.


13. వినెగార్, చెరకు రసం మరియు అల్లం తీసుకోవడం ద్వారా మీరు వైరస్ల నుండి రక్షింపబడలేరు. అవి కేవలం మన శరీరంలో రోగ నిరోధకశక్తిని మాత్రమే పెంచగలవు. మందులుగా ఉపయోగపడవు.


14. ఎల్లప్పుడూ మాస్కు ధరించడం వల్ల మీ శ్వాస మరియు ఆక్సిజన్ స్థాయిలకి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే మాస్కును ధరించం మంచిది.


15. చేతికి గ్లౌజులు ధరించడం కూడా మంచి ఆలోచన కాదు. మీరు ధరించిన గ్లౌజుల్లో వైరస్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ చేతులతో ముఖాన్ని తాకితే వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. కనుక క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మంచిది.


16. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనపడే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లు వాడుతున్నప్పటికీ ఇంటికే పరిమితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పార్క్ / బీచ్ లేదా మరెక్కడైనా తిరగవచ్చు.


17. వేయించిన / కారం / తీపి ఆహారాలు మరియు శీతల పానీయాలు తాగడం ద్వారా రోగనిరోధక శక్తి రాదు. వైరస్ కారకాలకు (PATHOGENS) మనం గురైనపుడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. *డాక్టర్ అర్జా శ్రీకాంత్*

*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*