కర్నూలు జిల్లాలో నివర్ తుఫాన్ పంట నష్టం వివరాలు సిద్ధం చేయండి..*కర్నూలు జిల్లాలో నివర్ తుఫాన్ పంట నష్టం వివరాలు సిద్ధం చేయండి..పంట, ప్రాణ, ఆస్థి, పశు నష్టాలపై..నివర్ తీవ్రతపై ప్రతి 2 గంటలకు ఒకసారి కలెక్టరేట్ కు రిపోర్ట్ పంపండి: ఇవాళ ఉదయం టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా, డివిజన్, మండల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్*


*రాత్రింబవళ్లు 24×7 నివర్ తుఫాన్ పై అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు  పర్యవేక్షిస్తూ..సమీక్ష చేస్తూ..అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ రామసుందర్ రెడ్డి, జిల్లా అధికారులు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మునిసిపల్ కమీషనర్లు. హెడ్ క్వార్టర్స్ బస చేసి 24×7 అలెర్ట్ గా ఉంటూ తుఫాన్ సహాయక చర్యల్లో ఉన్న  తహశీల్దార్లు, ఎంపిడివో లు, అన్ని శాఖల మండల అధికారులు. గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్న గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు*


*కర్నూలు జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావం శుక్రవారం నాడు శనివారం వరకు తీవ్రంగా ఉంటుంది..గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్, జిల్లా అధికారులు అందరూ హై అలెర్ట్ గా ఉండండి: శుక్రవారం ఉదయం 7 గంటల నుండి మండల తహశీల్దార్లు, ఎంపిడివో లు, ఆర్డీవో లు, మునిసిపల్ కమీషనర్లు, జిల్లా అధికారులతో నివర్ తుఫాన్ పై  టెలి కాన్ఫెరెన్సు/ అధికారుల వాట్సప్ గ్రూప్ సందేశాల ద్వారా సమీక్షలో కలెక్టర్ వీరపాండియన్ అదేశం*


*జేసీ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీవోలు వెంకటేష్, రామకృష్ణా రెడ్డి,  విపత్తు నిర్వహణ డిపిఎం అవినాష్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమీషనర్లు పాల్గొన్నారు*


*నంద్యాల,  కర్నూలు డివిజన్ల లో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మండలాలు, కుందూ తీరం, వక్కిలేరు సమీపాన, కడప బార్డర్ లో ఉన్న 17 మండలాల్లో 10 ఎం.ఎం.కు పైగా 84 ఎంఎం వరకు (చాగలమర్రి మండలం) వర్షపాతం శుక్రవారం ఉదయం వరకు నమోదు అయింది.. అందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ వీరపాండియన్*


*నంద్యాల, కర్నూలు డివిజన్లతో పాటు ఆదోని డివిజన్లో కూడా ఈ రోజు ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది.. అలెర్ట్ గా ఉండండి:సబ్ కలెక్టర్, ఆర్డీవోలకు కలెక్టర్ వీరపాండియన్ అదేశం*


*నివర్ తుఫాన్ వల్ల ప్రాణ, పంట, పశు, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పంట నష్టం వివరాలను వెంటనే సేకరించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.. అందువల్ల ప్రతి 2 గంటలకు ఒకసారి నివర్ తుఫాన్ ప్రభావ పంట నష్టం, ప్రాణ నష్టం, అస్తి నష్టం పై  రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడానికి వీలుగా జిల్లా, మండల అధికారులు తప్పని సరిగా ప్రతి 2 గంటలకు ఒకసారి నివర్ తుఫాన్ నివేదికను డిఆర్ఓ మరియు విపత్తుల నిర్వహణ డిపిఎం కు ఖచ్చితంగా పంపాలి: అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ అదేశం*


*జిల్లాలో ఎక్కడైనా మనుషులు, పశువులు, వాహనాలు నివర్ తుఫాన్ వర్షాలు/వరదల్లో చిక్కుకుంటే వెంటనే రక్షించండి: ఫైర్, పోలీస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ వీరపాండియన్*


*అందరూ హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలి ..24×7 కంట్రోల్ రూం పని చేయాలి: తహసీల్దార్లు, ఆర్డిఓలు,  జిల్లా అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశం*


*గ్రామాల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు నివర్ తుఫాన్ విపత్తు సమయంలో అప్రమత్తంగా, అందుబాటులో ఉండాలి..ప్రజలను నాళాలు, వాగులు, వంకలు, నదులు దాటకుండా అప్రమత్తం చేయాలి: కలెక్టర్ వీరపాండియన్ అదేశం* 


*నివర్ తుఫాన్ ప్రభావంతో నల్లమలలో పడే వర్షాల వల్ల  సిరివెళ్ల - రుద్రవరం రోడ్డులో ఉన్న మాలవాగు, వక్కిలేరు ఉధృతంగా ప్రవహించి, సిరివెళ్ల-రుద్రవరం మధ్య ట్రాఫిక్ నిలిచి పోయే  అవకాశం ఉంది..అందువల్ల పూర్తీ సన్నద్ధంగా ఉండండి.. అంబులెన్స్, మెడికల్ సిబ్బంది , మందులను వాగు ఆవల ఉన్న గ్రామాల్లో వెంటనే సిద్ధం చేసుకోండి.. వాగులు దాటవద్దని..పాడుబడిన మట్టి మిద్దెలు, గోడల కింద ఉండకూడదని ప్రజలకు దండోరా ద్వారా తెలపండి: రెవెన్యూ అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ అదేశం*


*ప్రజలు, వాహన దారులు ఉధృతంగా ప్రవహించే నాళాలు, వాగులు, వంకలను దాటకుండా, వాగుల్లో దిగకుండా తెలిపే విధంగా పోలీసులు, ఆర్ అండ్ బి అధికారులు రెడ్ కలర్ సూచిక బోర్డులు పెట్టండి..రాత్రి పూట వాగుల దగ్గర పోలీసు కాపలా పెట్టండి..ఎవరినీ దాటనివ్వకండి: కలెక్టర్ వీరపాండియన్*


*కుందూ నది తీర ప్రాంతాల్లో, నల్లమల అటవీ ప్రాంతాల్లో నివర్ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు, రేపు కురిసే భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉంది..ప్రాణ, పంట, ఆస్తుల నష్టం జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోండి..లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తుఫాను రిలీఫ్ క్యాంపు లకు తరలించండి: సబ్ కలెక్టర్,  అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్*


*నివర్ తుఫాన్ తీవ్రతను, ప్రాణ, పంట, ఆస్థి నష్టాన్ని తగ్గించడానికి..పగడ్బందీగా తుఫాన్ సహాయక చర్యల కోసం కలెక్టర్ కార్యాలయంలో, ఆర్డీవో, సబ్ కలెక్టర్ , తహసీల్దార్ కార్యాలయాల్లో నివర్ తుఫాన్ కంట్రోల్ సెంటర్స్ 24×7 పని చేసేలా..అన్ని శాఖల అధికారులు కంట్రోల్ రూంలో అందుబాటులో ఉండి.. ఎక్కడ ఏ అవసరం వచ్చినా వెంటనే తరలివెళ్లి ప్రజలకు సాయం చేసేలా నిరంతరం అప్రమత్తంగా ఉండండి: డిఆర్ఓ, ఆర్డీవో లు, సబ్ కలెక్టర్, జిల్లా అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ అదేశం*


*ఇప్పటికే 80 శాతం కు పైగా నిండిన చెరువుల అలుగుల వద్ద అప్రమత్తంగా ఉంటూ ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ ఇంజనీర్లను, రోడ్లు బ్లాక్ అయితే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని, రోడ్డుకు అడ్డంగా చెట్లు పడి పోతే వెంటనే క్లియర్ చేయాలని ఆర్ అండ్ బి , పీఆర్ ఇంజనీర్లను, విద్యుత్ నిలిచి పోతే వెంటనే రీస్టోర్ చేయాలని విద్యుత్ ఇంజనీర్లను, త్రాగునీటి ని క్లోరినేషన్ చేయించాలని, శానిటేషన్ ను బాగా చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని అన్ని ఇంజనీరింగ్ శాఖల ఎస్ఈ  లను, జిల్లా అధికారులను, డిఎంహెచ్ఓ, డిపిఓ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి ఎస్ఈ లను అదేశించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్* 


*అందరూ అలెర్ట్ గా ఉండండి..కుందూ, తుంగభద్ర నదులు, వాగులు, వంకల్లో దిగవద్దు.. దాటవద్దు: ప్రజలకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సూచన*