జగనన్న తోడు రుణాలపై స్టాంపు డ్యూటీ రద్దుకు ముఖ్యమంత్రి నిర్ణయం


జగనన్న తోడు రుణాలపై స్టాంపు డ్యూటీ రద్దుకు ముఖ్యమంత్రి నిర్ణయం

10 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 32 కోట్ల మేర లబ్ధి

    - ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్


జగనన్న తోడు పథకం క్రింద చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తుల వారికి అందించే రుణాలపై బ్యాంకు డాక్యుమెంటేషన్ స్టాంపు డ్యూటీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని గ్రామ/వార్డు సచివాలయాలు, గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. 

ఈ మేరకు ఆయన గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తుల వారు తమకు ఇస్తున్న రూ. 10,000 రుణం పై బ్యాంకులు వసూలు చేసే స్టాంపు డ్యూటీని తీసివేయాలని ముఖ్మమంత్రి కి విజ్ఞప్తి చేయగా, తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి స్టాంపు డ్యూటీని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.  దీనివల్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు 32 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. తద్వారా ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 324 చొప్పున   ప్రయోజనం కలుగుతుందన్నారు. జగనన్న తోడు క్రింద రూ. 10,000 వేలు వడ్డీలేని రుణాలు అందించేందుకు నవంబరు 25 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని  అజయ్ జైన్ తెలిపారు.

Comments