ఫుడ్‌ ప్రాససింగ్‌ క్లస్టర్లపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష.



ఫుడ్‌ ప్రాససింగ్‌ క్లస్టర్లపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష.

*గోడౌన్ల నుంచి ఫుడ్‌ ప్రాససింగ్‌ వరకు అన్ని కార్యకలాపాల కోసం సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు: ముఖ్యమంత్రి*


అమరావతి:(ప్రజా అమరావతి);

– ఫుడ్‌ ప్రాససింగ్‌ క్లస్టర్లపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

– వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులు హాజరు

– పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి, ఆ మేరకు ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు

– ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు, వాటి వల్ల ఉపయోగాలపై సమావేశంలో చర్చ

– ప్రాససింగ్‌ చేసిన తర్వాత మార్కెటింగ్‌ కోసం పెద్ద పెద్ద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటామన్న అధికారులు

– మొక్కజొన్న, చిరుధాన్యాలు (మిల్లెట్స్‌), కందులు, అరటి, టమోటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాససింగ్‌ ప్లాంట్లపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు

– ప్రాససింగ్‌ యూనిట్లకు దాదాపు రూ.2900 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించిన అధికారులు

– ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటును ప్రతిపాదించిన అధికారులు.


– రైతులకు మంచి ధరలు అందించాలన్నదే మన లక్ష్యం: వైయస్‌.జగన్‌

దీని కోసమే అనేక చర్యలు తీసుకుంటున్నాం:

– ఈ ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే మనం రైతులకు చెప్తున్నాం:

– కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది:

– అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ (వాల్యూ ఎడిషన్‌) జోడించడం చాలా ముఖ్యం:

– దీని కోసం ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం:

– వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం, ప్రాససింగ్‌ యూనిట్లకు ముడి పదార్థాలను అందించేలా ఉండాలి:

– ప్రాసస్‌ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌లో వివిధ సంస్థలకు అప్పగించాలి: 

– రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం? దానికి సరిపడా ఎక్కడెక్కడ ప్రాససింగ్‌ ప్లాంట్లను పెట్టాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం:

– రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సరి పడే సామర్థ్యంతో ఈ ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి

– రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న అరటి, చీనీ తదితర ఉత్పత్తుల ప్రాససింగ్, వాల్యూ యాడ్‌తో ఉత్పత్తుల తయారీ అంశాలపై దృష్టి పెట్టాలన్న సీఎం.

దీనిపై మరింతగా పరిశీలన, అధ్యయనం చేయాలన్న సీఎం.

– వ్యవసాయ ఉత్పత్తుల ప్రాససింగ్, ప్యాకేజింగ్‌ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక వింగ్‌ పని చేయాలి:

– ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో ఒక మెగా ప్లాంట్‌ అవసరం ఉందన్న అధికారులు, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం

– ఆర్బీకేల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి. అలాగే రెండో దశ ప్రాససింగ్, మొత్తం ఈ కార్యక్రమాల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం:

–ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లపై పెద్ద ఉత్తున డబ్బు వెచ్చిస్తున్నందున యూనిట్లన్నీ కూడా అత్యంత ప్రొఫెషనల్‌ విధానంలో నడవాలని, రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం ఆదేశం.

– వాటి నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్న సీఎం

– ఈ ప్రాససింగ్‌ యూనిట్లు బలోపేతంగా, సమర్థవంతగా నడపడం వల్ల రైతులకు అండగా నిలిచినట్టు అవుతుందన్న సీఎం

– ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి:

Comments