చిత్తూరు (prajaamaravati), నవంబర్ 11 : మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఒక సువర్ణ అద్యాయo అమలు అవుతూ ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాo ఆజాద్ గారి 133వ జన్మదినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవంను పురష్కరించుకొని మైనారిటీల సంక్షేమ దినోత్సవ సంధర్భంగా వివిధ జిల్లాలలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు తదితర అధికారులు, మైనారిటీ సోదరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సంధర్భంగా వివిధ జిల్లాలలోని మైనారిటీ సోధరులు వివిధ అంశాల గురించి ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేడు దేశ వ్యాప్తంగా గౌ.భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాo ఆజాద్ గారి 133 వ జన్మదినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవంను పురష్కరించుకొని మైనారిటీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందన్నారు. అబుల్ కలాం యొక్క సేవలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ఆయన విధ్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో విధ్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి, రైతు భరోసా, వై.ఎస్.ఆర్. చేయూత, వై.ఎస్.ఆర్. విధ్యా దీవెన, వసతి దీవెన, వై.ఎస్.ఆర్ వాహన మిత్ర తదితర పధకాల ద్వారా లబ్ది దారుల ఖాతాలకు నగదును జమ చేయడం జరుగుతూ ఉందన్నారు. మైనారిటీల సంక్షేమం కొరకు 3 వేల 488 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. దేవుని దీవెన తో, ప్రజల దీవెనతో ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆ భగవంతుడు, ప్రజలు నాకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి పర్వీన్, అధికారులు, చిత్తూరు జిల్లా వహ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ గౌష్ బాషా, చిత్తూరు జిల్లా ఖాదీ కయ్యాలుల్లా జహూరీ, జిల్లా మైనారిటీ లీడర్ అలీ, మైనారీటి సోదరులు, తదితరులు పాల్గొన్నారు.


Comments