*రాష్ట్ర ప్రభుత్వం విద్యా భివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను సద్విని యో గం చేసుకోండి* *ప్రతి విద్యార్థి ఉన్నత ల క్ష్యాల ను ఏర్పరుచు కుని వాటి సాధనకు కృషి చే యండి:జిల్లా కలెక్టర్* *చౌడేపల్లి(prajaamaravati) నవంబర్ 12:* ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యా లను ఏర్పరుచుకుని వాటి లక్ష్య సాధనకు కృషి చేయా లని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ గుప్త విద్యార్థు లకు హితబోధ చేశారు.. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చౌడేపల్లి మం డలం పుదిపట్ల హై స్కూల్ ను మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి,ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్ లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా ఈ పాఠశా ల లో నాడు- నేడు కింద జరిగిన పనులను పరిశీలిం చారు.నాడు- నేడు పథకం ద్వారా పాఠశాలలో జరిగిన అభివృద్ధిని విద్యార్థులు తె లుసు కోవాలన్నారు.కోవిడ్ 19 నేపథ్యంలో పాఠశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ప్రతి విద్యార్థి,విద్యార్థికి మ ధ్య భౌతిక దూరం ఉండేలా, విద్యార్థులు తరచూచేతులు శుభ్రం చేసుకొనేందుకు చర్య లు చేపట్టాలని ప్రధానో పా ధ్యాయురాలు వేదవతి ఆ దేశించారు. అనంతరం 9వ తరగతి వి ద్యార్థులకు గణితశాస్త్రం పై గల పరిజ్ఞానాన్ని జిల్లా కలె క్టర్ మరియు ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్ పరీక్షిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పర చుకుని వాటి సాధనకు కృషి చేయాలని, ప్రస్తుతం మద నపల్లి సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేస్తున్న విష్ణు చరణ్ విద్య పై మక్కువతో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచు కొని వాటిని సాధించారని వీరిని విద్యార్థులు ఆదర్శం గా తీసుకోవాలని సూచిం చారు..ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద అందిం చిన బ్యాగు,పుస్తకాలు,షూ స్ అన్నింటిని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని, ప్ర భుత్వం ఇచ్చిన యూనిఫాం కుట్టించుకొని వారం లోపు ప్రతి విద్యార్థి యూనిఫాం ధరించి పాఠశాల కు రావాల న్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, ఎంఇఓ కేశవ రెడ్డి, ఇంచార్జి తహసిల్దార్ మాధవి, సంబంధిత అధికా రులు పాల్గొన్నారు.


Comments