వార్డు స‌చివాల‌యాల్లో జె.సి. కిషోర్ కుమార్ త‌నిఖీలు* *రైస్ కార్డుల మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్ పై ఆరా. విజ‌య‌న‌గ‌రం (prajaamaravati), న‌వంబ‌రు 12; న‌గ‌రంలోని ప‌లు వార్డు స‌చివాల‌యాలను జాయింట్ క‌లెక్ట‌ర్‌(రైతుభ‌రోసా, రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆయా స‌చివాల‌యాల ప‌రిధిలో జ‌రుగుతున్న రైస్ కార్డుల మాపింగ్‌, జియో టాగింగ్ పై ఆరా తీశారు. న‌గ‌రంలోని అరుంధ‌తీ న‌గ‌ర్‌, అయ్య‌న్న‌పేట‌, బొబ్బాదిపేట‌ల్లోని వార్డు స‌చివాల‌యాల‌ను జిల్లా పౌర‌సర‌ఫ‌రాల అధికారి పాపారావుతో క‌ల‌సి జె.సి. త‌నిఖీ చేశారు. ఆయా వార్డు స‌చివాల‌యాస‌చివాలయాల్లో రైస్ కార్డు ద‌ర‌ఖాస్తుల పెండింగ్, ఇప్ప‌టికే మంజూరైన రైస్ కార్డుల‌ను క్ల‌స్ట‌ర్ వారీగా మాపింగ్‌, జియో ట్యాగింగ్ ఏవిధంగా చేస్తున్న‌దీ ప‌రిశీలించారు. కొత్త‌ రైస్ కార్డుల మంజూరు, కార్డులో కుటుంబ స‌భ్యుల పేర్లు తొల‌గింపు, చేర్చ‌డం, కార్డుల విభ‌జ‌న త‌దిత‌ర అంశాల‌పై అందే విన‌తుల‌ను జాప్యం లేకుండా త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని స‌చివాల‌య సిబ్బంది, వి.ఆర్‌.ఓ.ల‌కు సూచించారు.


Comments