శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (prajaamaravati): ఈ రోజు ది. 14 - 11 -2020న అడ్రెస్స్: డోర్ నెం.29 - 13 - 43, కాళేశ్వర రావు రోడ్, సూర్యారావు పేట, విజయవాడ-2 నకు చెందిన దాత శ్రీ భార్గవ రాము గారు శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 40 గ్రాముల బరువు గల బంగారు హారమును ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారిని కలిసి దేవస్థానంనకు కానుకగా సమర్పించారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం అమ్మవారి శేషవస్త్రము, చిత్రపటం, మరియు ప్రసాదము అందజేశారు.