స్పందన వినతులను సత్వరం పరిష్కరించండి. ఐ.టి.డి.ఏ, ప్రాజెక్ట్ ఆధికారి కూర్మనాథ్. పార్వతీపురం (prajaamaravati), నవంబర్ 16 :- గిరిశిఖర ప్రాంతాలలో ఎన్నో సమస్యలతో జీవితం కొనసాగిస్తున్న గిరిజనులు తమ సమస్య విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుంది అన్న నమ్మకం తో మనకి సమస్యలు పరిష్కరించాలని టెలి స్పందన ద్వారా వినతులు అందిస్తారు వాటిని సత్వరం పరిష్కరించే బాధ్యత అందరిపై ఉందని ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. సోమ‌వారం ఐ.టి.డి.ఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో టెలీ స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్ నిర్వహించారు, సబ్ ప్లాన్ మండలాలలో వున్న ప్రజల నుంచి విశేష స్పంద‌న వ్య‌క్త‌మ‌య్యింది. వివిధ సమస్యలపై విన‌తులు అందాయి. *టెలి స్పందన వినతుల వివరాలు*:- 1) సీతానగరం మండలం, బక్కుపేట గ్రామానికి చెందిన జి.రాము తమ గ్రామంలో 12 మందికి ఆర్. ఓ. ఎఫ్.ఆర్ పట్టాలు అందలేదని పట్టాలు ఇప్పించమని కోరారు. 2) పాచిపెంట మండలం, గుమ్మడి గూడ పంచాయతీ, నిలంవలస గ్రమనికిచెందిన లావిడి జెన్నీ చెంద్రయ్య గుమ్మడి గూడలో పాఠశాలకు ప్రహరీ గోడ కట్టడం జరిగిందని అందుకు సంబందించిన బిల్లు ఇంకా రాలేదని ఇప్పించమని కోరారు. 3) జీయ్యమ్మ వలస మండలం, టి. కె. జమ్ము గ్రామానికి చెందిన బిడ్డిక చక్రపాణి తనకు వ్యవసాయ భూమి వుందని తనకి నేటివరకు రైతు భరోసా పైకం ఖాతాలో జమకాలెదని, తనకు రైతు భరోసా పైకం ఇప్పించమని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. 4) కురుపాం మండలం పెద్దమర్రి గ్రామానికి చెందిన ఎ.సత్యనారాయణ తనకుమరునికి చెందిన జగన్న విద్యా దీవెన కు సంబందించిన పైకం బ్యాంక్ ఖాతాలో జమకాలేదని జమచేయించమని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. 5) పాచిపెంట మండలం, పి. కొనవలస గ్రామానికి చెందిన బైరిపల్లి ని మంగమ్మ APTW మహిళా కళాశాలలో ఉద్యోగం ఇప్పించమని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఇవియేగాక రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఇళ్లు, ఇళ్ల స్థ‌లాలు, భూ సంబంధ‌మైన విన‌తులు, త్రాగునీరు, బోరు రిపేర్లు, రోడ్లు నిమిత్తం ఫిర్యాదులు వచ్చాయని ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి అర్.కూర్మనాథ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ నుంచి వ‌చ్చిన టెలి స్పందన విన‌తులను, ఫిర్యాదుల‌ను ప‌రిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు అందిస్తూ సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ టెలి స్పందన కార్యక్రమానికి వెలుగు ఎపిడి సావిత్రమ్మ, డిప్యూటీ డి. ఇ. ఓ మోహన రాయుడు, పి.హెచ్. ఓ చిట్టి బాబు, ఎ.ఇ తిరుపతి రావు, ఎ.ఎం.ఓ కృష్ణా రావు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments