ప్రెస్ నోట్: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము,ఇంద్రకీలాద్రి,విజయవాడ (prajaamaravati); నందు ది.16.11.2020న కార్తీక శుద్ధ విదియ (యమ ద్వితీయ ) సందర్భముగా శ్రీ అమ్మవారి మూల స్వరూపమునకు వివిధ వర్ణములు గల గాజులతో విశేష అలంకారము చేయుటకు దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయించడమైనది. ప్రస్తుతము కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరము శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణము వరకు మాత్రమే గాజుల అలంకరణ చేయుటకు నిర్ణయించడమైనది. కావున పై తెల్పిన కార్యక్రమమును పురస్కరించుకొని, అలంకరణకు అవసరమైన గాజులను లేదా నగదు రూపేణా భక్తులు మరియు దాతల నుండి విరాళములు స్వీకరించబడుచున్నవి. విరాళములు ఇవ్వదలచిన భక్తులు మహామండపము దిగువన గల టోల్ ఫ్రీ కౌంటర్ నందు మరియు కొండ పైన గల డొనేషన్ కౌంటర్ నందు ది.14.11.2020, రాత్రి గం.06-00ల లోపుగా సమర్పించగలరు. శ్రీ అమ్మవారి సేవలో..... కార్యనిర్వహణాధికారి