శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (prajaamaravati): దేవస్థానము నందు అన్నదానము నిమిత్తం విరాళముగా శ్రీ అన్నే విజయ లక్ష్మి గారు అడ్రెస్స్: డోర్ నెం.21-5A, దుర్గి వారి వీధి, గాంధీనగర్, విజయవాడ-3 వారు రూ.1,00,000/-లు శ్రీ A.విజయలక్ష్మి గారి పేరు మీద అన్నదానం జరుపుటకు గాను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారిని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాతలకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము శ్రీ అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రము, ప్రసాదము అందజేసినారు.