తాడేపల్లి (prajaamaravati) విలేజ్‌ సెక్రటేరియట్, వార్డ్‌ సెక్రటేరియట్‌లలో పనిచేస్తున్న గ్రామ, వార్డ్‌ సచివాలయ సిబ్బందికి శిక్షణ, సేవలపై పంచాయితీరాజ్‌ కమీషనర్‌ కార్యాలయంలో మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ, పంచాయితీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, విలేజ్, వార్డ్‌ సెక్రటేరియట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్, విలేజ్, వార్డ్‌ సెక్రటేరియట్‌ కమీషనర్‌ నవీన్‌కుమార్, ఉన్నతాధికారులు సమీక్ష – ప్రభుత్వ సేవలు, సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతీ లబ్దిదారుడికి సత్వరం అందేలా చర్యలుండాలి, సేవల్లో ఏ మాత్రం జాప్యం జరగరాదు. ఇందుకవసరమైన పూర్తిస్ధాయి శిక్షణ ఇవ్వాలి – విలేజ్, వార్డు సెక్రటేరియట్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రొబేషనరీ పిరియడ్‌ రెండు సంవత్సరాలు పూర్తయ్యేవరకూ బదిలీలు, డిప్యుటేషన్లు ఉండవు – 800 మంది ప్రిన్సిపల్‌ ట్రైనర్స్‌ ద్వారా శిక్షణ – ఇప్పటికే వారం రోజుల పాటు ముగిసిన మొదటి విడత శిక్షణ – ఆధార్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్‌...248 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులకు, డిజిటల్‌ అసిస్టెంట్‌లకు ట్రైనింగ్‌ పూర్తి – ఆధార్‌ డేటాలో తప్పుడు సమాచారం నమోదుచేయకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చ – డివిజనల్‌ లెవల్‌ ట్రైనింగ్‌ ఇప్పటికే 6 జిల్లాలలో పూర్తి, మిగిలిన 7 జిల్లాలలో డిసెంబర్‌ 2 కల్లా పూర్తిచేయాలని నిర్ణయం – మండలస్ధాయి ట్రైనింగ్‌ కూడా 6 జిల్లాలలో జరుగుతుందన్న అధికారులు – ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సాఫ్ట్‌స్కిల్స్‌ ట్రైనింగ్‌ – నాన్‌ ఇంజినీరింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వారికి డిజిటల్‌ లిటరసీ ట్రైనింగ్‌ – డిజిటల్‌ అసిస్టెంట్‌లు, వార్డ్‌ ఎడ్యుకేషన్‌ మరియు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలు, పంచాయితీ సెక్రటరీలు, వార్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు, వార్డ్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలకు ఈ– సర్వీస్‌ ట్రైనింగ్‌ ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి – త్వరలో ప్రారంభించనున్న జగనన్న తోడు పధకం స్టేటస్‌పై సమావేశంలో చర్చ – గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అవసరమైన అధునాతన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, ట్రైనింగ్‌ విషయంలో సమావేశంలో చర్చ – ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక్కో ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయం – లబ్దిదారుల జాబితా అందరికీ అర్ధమయ్యేలా తెలుగులో ఉండాలి.


Comments