గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌: అమరావతి (prajaamaravati): సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను కలిశారు. దీపావళి పండగ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. సతీమణి శ్రీమతి వైయస్‌ భారతితో సహా రాజ్‌భవన్‌ వెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, గవర్నర్‌ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్‌కు వివరించారు.


Comments