, అమరావతి (prajaamaravati). *సమాజానికి నిజమైన మార్గదర్శకులు విలేకరులే : ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *పాత్రికేయులకు "జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు" : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *అభిమానం, అభిరుచులకు అతీతంగా పని చేస్తున్నవారికి శుభాభినందనలు* *వార్తలో వేగంతో పాటు నాణ్యత, స్పష్టత అవసరమే* ప్రజాహితమే పరమావధిగా శ్రమిస్తోన్న విలేకరులకు "జాతీయ పత్రికా దినోత్సవం" సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. కుటుంబం, కులం, అధికారం, మతం, ప్రాంతం, ధనం, వ్యవస్థలు, వ్యక్తులు, అభిమానం, అభిరుచులకు అతీతంగా దేనికీ ప్రభావితం కాకుండా పని చేస్తున్న నిఖార్సయిన పాత్రికేయుల పాత్ర విలువ మాటల్లో చెప్పేంత చిన్నది కాదన్నారు. ముందుతరాల వారే స్ఫూర్తిగా నేటి తరం మీడియా ....సమాజ చైతన్యం, శ్రేయస్సుకై ఆదర్శంగా తీసుకుని పాటు పడాలని మంత్రి ఆకాంక్షించారు. సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ వార్త వెనుక వాస్తవాలను చెప్పడంలో వేగంతో పాటు నాణ్యత, స్పష్టత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. తీవ్రమైన పోటీలో భాగంగా క్షణాల్లో సమాచారం చేరవేయడం వెనుక బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఒత్తిళ్లు, ఇబ్బందులను లక్ష్యం చేయకుండా పరితపిస్తూ పని చేస్తున్న పాత్రికేయులే నిజమైన మార్గదర్శకులని మంత్రి మేకపాటి అభివర్ణించారు.