*ధర్మారంలో నిషేధిత v1 పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాటి విలువ సుమారు 13,000/-వేల రూపాయలు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. సత్యనారాయణ గారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది శ్రీనివాస్,ప్రకాష్, సునీల్ లు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంకి చెందిన *గుంట భాస్కర్, కమ్మి శెట్టి సాయి కిషోర్ లు* పొగాకు ఉత్పత్తులు మరియు గుట్కా వేరే ప్రాంతం నుండి తెచ్చి నిల్వ ఉంచి అమ్ముతున్నారు అనే పక్కా సమాచారంతో ధర్మారం, బిసి కాలనీ లో *కమ్మి శెట్టి సాయి కిషోర్ s/o. పుల్లారావు,19 yrs, ఒడ్డెర, బిసి కాలనీ, ధర్మారం* అనే వ్యక్తి ఇంటి ని తనిఖీ చేయగా అతని ఇంటి వద్ద అమ్మడానికి సిద్ధంగా ఉంచిన పొగాకు ఉత్పత్తులు లభించాయి. ఇవి ఎక్కడ నుండి సరఫరా చేస్తున్నావు, నీకు ఎవరు సరఫరా చేస్తున్నారని విచారణ జరపగా ఇట్టి v1 పాకెట్స్ సంచులు *గుంట భాస్కర్ s/o నారాయణ,33 yrs, (సాయి కిరాణం),ధర్మారం* కి సంబందించినవి అని తెలపడం జరిగింది.వీటి విలువ బహిరంగ మార్కెట్ లో వీటి విలువ సుమారు 13,000/- వరకు ఉంటుంది. ఇట్టి పొగాకు ఉత్పత్తులైన గుట్కాను స్వాధీనం చేసుకుని, నిందితులను మరియు గుట్కా పొగాకు ఉత్పత్తులను తదుపరి చర్యల గురించి కాల్వ ధర్మారం పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.