రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సివిఎస్వో, తిరుపతి అర్బన్ ఎస్పీ.


  రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సివిఎస్వో, తిరుపతి అర్బన్ ఎస్పీ.


       

 తిరుమల‌ (ప్రజా అమరావతి): ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలో జ‌రుగ‌నున్న రథసప్తమి పర్వదినానికి విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆల‌య మాడ వీధుల్లో చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను టిటిడి  సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ  వెంకట అప్పల నాయుడుతో కలిసి ఆదివారం ప‌రిశీలించారు. 


 అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవనంలో రథసప్తమి ఏర్పాట్లపై పోలీసు, టిటిడి విజిలెన్స్ అధికారుల సమావేశం జరిగింది.


 ఇందులో రథసప్తమి పర్వదినానికి విచ్చేసే భక్తులకు భద్రతా, ట్రాఫిక్ , పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.   కోవిడ్ -19 నిబంధనల మేరకు మాడవీధుల్లో వాహన సేవలు, గ్యాలరీలోని భక్తులకు అన్నప్రసాద పంపిణీ, శానిటేషన్ తదితర అంశాలపై చర్చించారు.  


 అదేవిధంగా అలిపిరి వద్ద టోకెన్ల పరిశీలన, టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించే విషయమై చర్చించారు.


ఈ సమావేశంలో  తిరుమల అదనపు ఎస్పీ శ్రీ ముని రామయ్య, డిఎస్పీ శ్రీ ప్రభాకర్, విజివోలు శ్రీ ప్రభాకర్, శ్రీ మనోహర్, పోలీసు, టిటిడి విజిలెన్స్  అధికారులు పాల్గొన్నారు.