అమరావతి (ప్రజా అమరావతి):
వ్యవసాయశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
*అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ స్పెషల్ సెక్రటరీ వై మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ పి యస్ ప్రద్యుమ్న, ఏపీ డీడీసి ఎండీ అహ్మద్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.*
*సమీక్షలో సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..:*
ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను ఉద్దేశించి రాష్ట్ర స్ధాయిలో వ్యవసాయ, ఆక్వా రంగంలో తీసుకొచ్చిన వివిధ చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలి: అధికారులకు సీఎం ఆదేశం
దీంతో పాటు రైతులు మోసాలకు గురికాకుండా, వారికి అండగా నిలవడానికి కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పాం: సీఎం
ఈ మేరకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లపై ఆలోచన చేయమని అధికారులను ఆదేశించాం: సీఎం
దీనికి సంబంధించి పోలీసు విభాగంతో వ్యవసాయశాఖ సమన్వయం చేసుకోవాలి: సీఎం
పొలంబడిలో భాగంగా కౌలురైతులకోసం చేసిన చట్టంపై అవగాహన కల్పించాలి :
సాగు ఒప్పంద పత్రం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని అవగాహన కల్పించాలి :
ఆర్బీకేల్లో దీనికి సంబంధించిన వివరాలతో పోస్టర్ కూడా పెట్టాలి :
ఆర్బీకే కింద రైతులకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నదానిపై హోర్డింగ్ పెట్టించాలి:
అలాగే విలేజ్ క్లీనిక్స్ వద్దకూడా కార్యకలాపాలపై హోర్డింగ్ పెట్టించాలి:
గ్రామ సచివాలయాలు చేస్తున్న కార్యక్రమాలపైనకూడా ఈ హోర్డింగ్ ఉండాలి:
దీనివల్ల ప్రజలకు ఆయా కార్యకలాపాలపై అవగాహన కలుగుతుంది: సీఎం స్పష్టీకరణ
పంటల బీమాకోసం ప్రభుత్వం తరఫున బీమా కంపెనీ ఏర్పాటుపై సత్వర చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం ఆదేశం
దీనికి ప్రత్యేక అధికారిని నియమించాలి : సీఎం
2020–21 ఖరీఫ్‌నకు సంబంధించిన బీమా సొమ్ము చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
మేలో మొదటివిడత రైతు భరోసా ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి : సీఎం
సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు జరగాలి : సీఎం
ఇది సక్రమంగా అమలు జరుగుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ, పరిశీలన చేయాలి: సీఎం
మిల్లర్లే నేరుగా ఆర్బీకేల వద్దకు వచ్చి కొనుగోలుచేయాలన్న సందేశం గట్టిగా వెళ్లాలి :
ఏపీ అమూల్ ప్రాజెక్టు, ఆక్వా హబ్‌ల ఏర్పాటు పైనా సీఎం సమీక్ష
మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం సమీక్ష
నిధుల సమీకరణ, ఏర్పాటుకోసం తీసుకోవాల్సిన చర్యలపైన సీఎం సమీక్ష
*జనతా బజార్లపైనా సమీక్ష నిర్వహించిన సీఎం*
500 చదరపు అడుగుల నుంచి 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతాబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
తొలిదశలో 5వేల జనాభాకు జనతా బజార్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం
దీనికోసం భవనాల నిర్మాణం
బయట మార్కెట్లో కన్నా తక్కవ ధరలకే నాణ్యమైన సరుకులు జనతాబజార్లలో లభించాలి: సీఎం శ్రీ వైయస్.జగన్
అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది: సీఎం
రైతులకు కనీస మద్దతు ధరలు లభించాలి : వీటితోపాటు అవే సరుకులు వినియోగదారులకు తక్కువ ధరలకు లభించేలాఉండాలి: సీఎం
జనతాబజార్ల ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది: సీఎం స్పష్టీకరణ.
addComments
Post a Comment