పేదలకు ఇళ్ల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్ష.
*పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్, చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, ఏపి స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరు*
అమరావతి (ప్రజా అమరావతి):
*సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే...*
*వైయస్సార్ జగనన్న కాలనీల్లో వేగంగా ఇళ్ళ నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం*
*మౌలిక సదుపాయాల విషయంలో పలు సూచనలు చేసిన సీఎం*
*వైయస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారకూడదని అధికారులు స్పష్టంగా చెప్పిన సీఎం*
*చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్ళు ఇస్తున్నాం కాబట్టి సౌకర్యవంతంగా ఉండాలి – సీఎం*
*బ్యూటిఫికేషన్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టండి, ప్రతీ ఒక్క లేఔట్‌ను రీవిజిట్ చేసి దానికి తగిన విధంగా అందంగా, అహ్లదంగా తీర్చిదిద్దాలి*
*ఇళ్ళ నిర్మాణానికి సంబందించిన నిధులు – ప్రణాళిక*
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని సీఎం ఆదేశం
ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలని సీఎం ఆదేశం
దీనివల్ల పేదలకు ఇళ్లనిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయన్న సీఎం
తొలివిడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని వెల్లడించిన అధికారులు
మిగతా వారినుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలన్న సీఎం
మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా.. లబ్ధిదారునకు సబ్సిడీపై
సిమెంటు, స్టీల్‌ను అందించాలని సీఎం ఆదేశం
బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందన ఆ అవకాశం అందరికీ
వర్తింప చేయాలన్న సీఎం
అలాగే నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని, దీనివల్ల తామే ఇళ్లుకట్టుకుంటామంటూ ఆప్షన్ ఎంచుకున్నవారికీ లబ్ధి చేకూరుతుందన్న సీఎం
ఏ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నా, వారికి తక్కువ ధరలకు సామగ్రి లభ్యం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్న సీఎం
దీనివల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్న సీఎం
*కాలనీల్లో మౌలిక సదుపాయాలు, బ్యూటిఫికేషన్*
అన్ని ఇళ్లనూ జియోట్యాగింగ్ చేస్తున్నామన్న అధికారులు
పేదలకు ఇళ్లనిర్మాణానికి సంబంధించి ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశం
వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశం
వైయస్సార్ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలన్న సీఎం
కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలన్న సీఎం
కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఉంటే.. కచ్చితంగా తీసుకోవాలన్న సీఎం
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండేలా చూడాలని, రోడ్ల నిర్మాణం జనాభాకు అనుగుణంగా ఉండాలని సీఎం ఆదేశం
ఒకసారి అన్ని లేఔట్లను రీ విజిట్ చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశం
కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ ఉండాలని, ప్రతి 1500నుంచి 5వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశం
పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
అలాగే పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడంద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం సమీక్ష
కాలనీల డిజైన్లను పరిశీలించిన సీఎం
రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై పలు సూచనలు చేసిన సీఎం
ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం
కాలనీల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలను అనుసరించాలని సీఎం ఆదేశం
కాలనీల్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సీఎం ఆదేశం
ఏ చెట్టు అంటే ఆ చెట్టు కాకుండా ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే చెట్లను నాటాలన్న సీఎం
మంచి వృక్షజాతులను ఎంచుకోవాలని సీఎం ఆదేశం
కాలనీలు నిర్మాణం అవుతున్నప్పుడే చెట్లను నాటడానికి మార్కింగ్ చేయాలని సీఎం ఆదేశం
ఇంటి ముందు నుంచి వీధి రోడ్లు, కాలనీ ప్రధాన రోడ్ల వరకూ చెట్లను నాటడానికి మార్కింగ్ వేసుకోవాలని సీఎం ఆదేశం.
addComments
Post a Comment