శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: 



దేవస్థానము నందు శ్రీ శార్వరీ నామ సంవత్సరము మాఘమాసము పురస్కరించుకొని ది: 12 - 02 -2021 వ తేది నుండి ది: 13-03-2021వ తేది వరకు మాఘ మాసములో వచ్చు ఆదివారములు, రధ సప్తమి, ఏకాదశిలు, పూర్ణిమ దినముల యందు మొత్తం 9 రోజులలో లోకకళ్యాణార్ధము శ్రీ అమ్మవారి దేవస్థానము నందు సుర్యోపాసనలు జరుగుటలో భాగముగా ఈరోజు అనగా ది.19-02-2021 , రధసప్తమి సందర్భంగా  ఆలయ అర్చకులు సూర్యోపాసన సేవ లో భాగముగా  అరుణ పారాయణసౌరము, సూర్య నమస్కారములు, సూర్యుని జపములు నిర్వహించారు.


  తదుపరి,  క్రింది తెలిపిన తేదిలలో శ్రీ అమ్మవారి దేవస్థానము నందు సుర్యోపాసనలు మాఘ మాసములో( ది: 12 -02 -2021 వ తేది నుండి ది: 13-03-2021 వ తేది వరకు) ఆదివారములు, రధ సప్తమి, ఏకాదశిలు, పూర్ణిమ దినముల యందు అరుణ పారాయణసౌరము, సూర్య నమస్కారములు, సూర్యుని జపములు శ్రీ నటరాజ స్వామి మండపము వద్ద గల నృత్యనీరాజనము కళావేదిక వద్ద జరుగును.


సం.    తేది       వారం                                తిధి


1.   21-02-2021 ఆదివారం - శుద్ధ నవమి

2. 23 -02-2021 మంగళవారం - శుద్ధ ఏకాదశి,

3. 27-02-2021 శనివారం- పూర్ణిమ 

4. 28 -02-2021 మాఘ ఆదివారం,

5. 07 -03 -2021 మాఘ ఆదివారం,

6. 09-03 -2021   మంగళ వారం -  బహుళ ఏకాదశి,

7. 11-03 -2021- గురువారము- మహాశివరాత్రి


వేదిక: శ్రీ నటరాజ స్వామి మండపము వద్ద గల నృత్య నీరాజనం కళా వేదిక వద్ద

సమయము: ఉ|| 8:00 నుండి

సేవా రుసుము(1 టిక్కెట్): రూ. 1,000/-లు (దంపతులకు)


ప్రసాదములు: 

1. శ్రీ చక్రార్చన లడ్డు - 1 నెం. 

2. శేష వస్త్రము - 1 నెం.

3. రవిక - 1 నెం.

4. గోధుమ పొంగలి - 100 గ్రా.


సూర్యోపాసన  మరియు ఇతర సేవలలో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానము యొక్క వెబ్సైటు www.kanakadurgamma.org నందు గానీ, మొబైల్ ఆప్(ఆండ్రాయిడ్ playstore) ‘kanakadurgamma’  నందు కానీ, మీ-సేవ సెంటర్లు నందు కానీ, దేవస్థానము మహామండపము 7 వ అంతస్తు నందు ఆర్జిత సేవ కౌంటరు నందు కానీ టికెట్లు పొందగలరు.

Comments