అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన చెన్నైలో జపాన్ కాన్సులేట్ జనరల్ మసయుకి తాగ.
*ఈ సందర్భంగా మసయుకి తాగను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్.*
*సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే...*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో కూడిన సమర్ధవంతమైన పాలనతో ప్రజల ముంగిటకే అన్ని ప్రభుత్వ సేవలను అందిస్తోంది. అదే క్రమంలో పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములకు రాష్ట్రంలో ఉత్తమ వ్యాపార అవకాశాలను కల్పిస్తోంది.
రాష్ట్రంలో స్ధానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించేందుకు గాను పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలను ప్రభుత్వం ఆహ్వనిస్తోంది.
ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలకు, పారదర్శకంగా అమలు చేస్తున్న విధానాలకు నిదర్శనమే.... డిపిఐఐటీ, కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌లు సంయుక్తంగా ప్రకటించిన ర్యాంకుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకును సాధించడం.
పలు ప్రముఖ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. దానిలో భాగంగా ఆదానీ ఎంటర్‌ప్రైజెస్ 200 మెగావాట్ల డెటా సెంటర్ పార్క్, స్కిల్ యూనివర్శిటీ, ఐటీ పార్క్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. దీని ద్వారా సుమారు 25,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఇంటెలిజెంట్ సెజ్ లో ఫుట్‌వేర్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా దాదాపు 12,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రానున్న రోజుల్లో అతి వేగంగా వృద్ది చెందే రంగాలుగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ, విడిభాగాల ఉత్పత్తి రంగం దేశంలోనే రాబోయే రెండు మూడేళ్ళలో 800 మిలియన్ల మార్కెట్‌కు చేరుకుంటుందని అంచనా. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఈ రంగంలో పెట్టుబడులపై దృష్టి సారించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీలను రూపొందించింది. నైపుణ్యం కల టెక్నీషియన్స్, ప్రపంచ స్ధాయి మౌలిక సదుపాయాలను కల్పించి, ఈ రంగాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఏపీ పెట్టుబడులకు కేంద్రబిందువుగా మారనుంది.
ఈ క్రమంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఇంటిగ్రెటెడ్ టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటుచేసి రానున్న రోజుల్లో హై ఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్శిటీ, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ల్యాబ్స్, కో వర్కింగ్ స్పేసెస్, ఐకానిక్ ఐటీ టవర్స్, స్టేట్ డేటా సెంటర్ ల ఏర్పాటుతో ఐటీ సెక్టార్‌కు అన్ని విషయాల్లోనూ ప్రోత్సాహకాలు అందించనుంది.
ఏపీ ప్రభుత్వం వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో అన్ని వనరులతో కూడిన ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గ్రామ పంచాయితీల స్ధాయిలో డిజిటల్ లైబ్రరీలు, హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం, వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని దాదాపు 15 వేలకు పైగా గ్రామ పంచాయితీలకు అందుబాటులోకి తీసుకురావడం, దాదాపు 90 వేలకు పైగా వర్క్ స్టేషన్స్ ఏర్పాటుచేసి మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది.
వైఎస్‌ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో ప్రపంచస్ధాయి ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటుచేయడం ద్వారా ఆ రంగంలోని తయరీదారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ క్లస్టర్‌లో పరిశ్రమల ఏర్పాటకు భూమి, విద్యుత్, నీరు, రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్ కార్గో తదితర రవాణా సదుపాయాలకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది
రాష్ట్రంలో నిపుణులైన ఐటీ, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్లను తయారుచేసేందుకు విశాఖపట్టణంలో హై ఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటుచేస్తుంది. ఐటీ, ఎలక్ట్రానిక్ తయరీ రంగాలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది.
addComments
Post a Comment