భారత రాష్ట్రపతి పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి మదనపల్లె లో సాదర స్వాగతం,వీడ్కోలు .

  భారత రాష్ట్రపతి పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి మదనపల్లె లో సాదర స్వాగతం,వీడ్కోలు . 


 మదనపల్లె (ప్రజా అమరావతి), ఫిబ్రవరి 7:* గౌ.భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కొవింద్ ఒక రోజు పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేయుచున్న సందర్భంగా భారత రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మదనపల్లికి విచ్చేశారు. ఆదివారం ఉదయం మదనపల్లి బిటి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఉ.11.40 కి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణ స్వామి,రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాజంపేట, చిత్తూరు ఎంపిలు మిథున్ రెడ్డి, ఎన్. రెడ్డెప్పలు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లి, పలమనేరు ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారాకనాథ రెడ్డి, వెంకటే గౌడ్ లు, అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్, ఎస్.పి సెంథిల్ కుమార్, జె సి (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, మదనపల్లె సబ్ కలెక్టర్ ఎం. జాహ్నవి, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

          అనంతరం మ.11.56 గం. లకు చిప్పిలి హెలిప్యాడ్ చేరుకున్న గౌరవ భారత రాష్ట్రపతికి ముఖ్యమంత్రి స్వాగతం పలికారు.  తదుపరి తిరిగి బి.టి కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని మధ్యాహ్నం 12.24 గం. లకు హెలికాప్టర్ ద్వారా రేణిగుంట విమానాశ్రయం బయలుదేరి వెళ్లారు.

          ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట, చిత్తూరు ఎంపిలు మిథున్ రెడ్డి, ఎన్. రెడ్డెప్పలు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లి, పలమనేరు ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారాకనాథ రెడ్డి, వెంకటే గౌడ్ లు, మదనపల్లె సబ్ కలెక్టర్ ఎం. జాహ్నవి, ప్రతినిధులు,తదితరులు కలరు.


Comments