శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి);
నందు శ్రీ శార్వరీ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి ది: 16-02-2021 శ్రీ పంచమి శ్రీ సరస్వతి అమ్మవారి జన్మదినముగా చెప్పబడుచున్నది. జ్ఞాన ప్రదాయిని వాగ్దేవి అయిన సరస్వతి దేవిని ఆరాధించుట వలన జ్ఞానసిద్ధి కలిగి చైతన్య వంతులు అగుదురు. సదరు శ్రీ పంచమి రోజున శ్రీ దుర్గాదేవికి మరియు ప్రధాన ఉత్సవ మూర్తికి సరస్వతి దేవిగా అలంకరించుట జరుగుచున్నది. మరియు దేవస్థాన వేదపండితులచే సరస్వతి మంత్ర హవనము నిర్వర్తించుట జరుగుచున్నది. సదరు శ్రీ పంచమి కార్యక్రమము మల్లిఖార్జున మహా మండపము 6వ అంతస్తు నందు నిర్వహించబడును.
సదరు శ్రీ పంచమి కార్యక్రమమునకు పాఠశాల మరియు కళాశాల విద్యార్ధినీ, విద్యార్ధులకు ఉచిత దర్శనము ఉ|| 7:00 గం.ల నుండి సా|| గం. 5:00 ల వరకు ఏర్పాటు చేయడమైనది.
విద్యార్ధినీ, విద్యార్ధులకు తెలియజేయునది ఏమనగా, వారి గుర్తింపు కార్డులు/యూనిఫారం ధరించి శ్రీ అమ్మవారి దర్శనమునకు రావలెను.
శ్రీ అమ్మవారి దర్శనమునకు వచ్చు విద్యార్ధినీ, విద్యార్ధులకు కనకదుర్గానగర్ నుండి అర్జున వీధి గుండా మహామండపం నందు ఉచిత క్యూలైన్లు ద్వారా ముఖ మండపం దర్శనం ఏర్పాటు చేయటమైనది. మరియు ఉచిత దర్శనం అనంతరం మహామండపము 6 వ అంతస్తు నందు విద్యార్ధిని, విద్యార్ధులకు ఒక కలము, శ్రీ అమ్మవారి(పాకెట్ సైజు) ఫోటో, శ్రీ అమ్మవారి రక్షాకంకణం, కుంకుమ ప్రసాదం ఇవ్వబడును.
విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రత్యేకముగా క్యూలైన్లు ఏర్పాటు చేయుట జరిగినది. మరియు మంచి నీరు సరఫరా చేయుట జరుగుచున్నది.
ది: 16-02-2021వ తేదిన మూల విరాటును మరియు ఉత్సవ మూర్తులకు శ్రీ సరస్వతీ దేవి అలంకారము చేయబడును.
కావున విద్యార్ధిని, విద్యార్ధులు మరియు భక్తులు శ్రీ సరస్వతీ దేవి అలంకారములో వున్న అమ్మవారిని దర్శించి ఆమె కృపకు పాత్రులు కాగలరని తెలియజేయడమైనది.
శ్రీ అమ్మవారి సేవలో..
కార్యనిర్వహణాధికారి.
addComments
Post a Comment