పరిశ్రమలు సంస్థల్లో రెగ్యులేటరీ కంప్లెయెన్స్ భారం తగ్గింపుపై రోజుల వర్కుషాపు
అమరావతి(ప్రజా అమరావతి) ,10 ఫిబ్రవరి:వివిధ పరిశ్రమలు సంస్థల్లో రెగ్యులేటరీ కంప్లెయన్స్ భారాన్ని ఏవిధంగా తగ్గించాలన్నఅంశంపై డిపార్టుమెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి)ఆధ్వర్యంలో ఈనెల 10,11 తేదీల్లో రెండు రోజులపాటు అమరావతి సచివాలయంలో జరిగే వర్కుషాపు తొలిరోజు బుధవారం సియం సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది.ఈవర్కుషాపులో పాల్గొన్న సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు,సంస్థల్లో ఏవిధంగా రెగ్యులేటరీ కంప్లయన్స్ విధానంలో భారాన్నితగ్గించేందుకు వీలుగా తగిన కార్యాచరణ ప్రణాళికను ఈనెల 18వతేదీ నాటికి సిద్ధం చేయాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.ఈనెల 20వతేదీన ఢిల్లీలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇందుకు సంబంధించిన పోర్టల్ ను ఆవిష్కరించనున్నారని తెలిపారు.కావున ఈనెల 18నాటికి కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎస్ ఆదేశించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మినిమైజింగ్ రెగ్యులేటరీ కంప్లెయెన్స్ బర్డెన్ కు సంబంధించిన పోర్టల్ ను రూపొందించడం జరుగుతోందని సిఎస్ పేర్కొన్నారు.
ఈసమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్ మాట్లాడుతూ రెండవ రోజు సదస్సు గురువారం ఉ.11గం.లకు సచివాలయం రెండవ బ్లాకు సమావేశ మందిరంలో నిర్వహిస్తామని తెలిపారు.పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ పరిశ్రమలు,సంస్థల్లో రెగ్యులేటరీ కంప్లెయెన్స్ తగ్గింపు అంశానికి గుర్తించిన వివరాలను తెలిపారు.ఇంకా ఈసమావేశంలో ముఖ్య కార్యదర్శులు అజయ్ జైన్,రామ్ గోపాల్,ఉదయ లక్ష్మి,పలువురు కార్యదర్శులు,డిపిఐఐటి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment