శాస్త్రోక్తంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం
ముగిసిన బ్రహ్మోత్సవాలు.
తిరుమల (ప్రజా అమరావతి) : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు ఆలయం వద్ద గల వాహన మండపంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములను, చక్రత్తాళ్వార్‌ను ఆలయం వద్ద గల వాహన మండపంలోనికి వేంచేపు చేశారు. అనంతరం సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో అభిషేకం చేశారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ గంగాళంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
కాగా రాత్రి 8.30 నుండి 9.౩౦ గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment