స్పందన కార్యక్రమంలో భాగంగా క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.



స్పందన కార్యక్రమంలో భాగంగా క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.



అమరావతి (ప్రజా అమరావతి):

*ఎన్నికలు కారణంగా చాలారోజులగా కలెక్టర్లతో సమావేశం కాలేకపోయాను: సీఎం వైయస్‌.జగన్‌*

*జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో 6రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది:*

*అదికూడా ముగిస్తే.. ఇక వ్యాక్సినేషన్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలమీద దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది: సీఎం*


*ఉపాధి హామీ పనులు, ఇళ్లపట్టాలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో నాడు – నేడు, మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్‌కాలేజీలు, ఆర్‌ అండ్‌ బి, వైయస్సార్‌ బీమా, జగనన్నతోడు, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ఆసరా ప్రగతి, రబీ–2020, ఖరీఫ్‌–2021 పంటల కొనుగోళ్లు, వీటితోపాటు ఏప్రిల్‌లో ప్రారంభించనున్న జగనన్న విద్యా దీవెన , వలంటీర్లకు సత్కారం, వైయస్సార్‌ సున్నా వడ్డీ రైతులకు, వైయస్సార్‌ సున్నా వడ్డీ స్వయం సహాయ సంఘాలకు, జగనన్న వసతి దీవెన కార్యక్రమాలపై సీఎం సమీక్ష*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:* 


*ఉపాథిహామీ పనులు:*

ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించారు: సీఎం

కలెక్టర్లకు అభినందనలు:

మార్చి 15 నాటికి 2427 లక్షల పనిదినాలు కల్పించాం: సీఎం 

2020–21 ఆర్ధిక సంవత్సరంలో 2525 లక్షల పనిదినాలు చేరుకోబోతున్నాం: సీఎం

దాదాపు రూ.6వేల కోట్ల రూపాయలు ఉపాథిహామీ కింద కూలీలకు ఇవ్వగలిగాం:

యుద్ధ ప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలను పూర్తిచేయాలి:

మే, 2021 నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలి:

అలాగే ఆర్బీకేలను పూర్తి చేయడంపైనా దృష్టిపెట్టాలి:

ఆర్బీకేల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది:

అలాగే వైయస్సార్‌ హెల్త్‌క్లినిక్స్‌ను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలి:

వీటన్నింటిపైనా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి:


*బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు*

అమూల్‌తో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం:

పాడి రైతులకు మంచి ధర వచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం:

దీనివల్ల గ్రామీణఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది:

బీఎంసీ, ఏంఎంసీల నిర్మాణాలపైనా దృష్టిపెట్టాలి:

నెలాఖారు కల్లా అన్ని ప్రాంతాల్లో బీఎంసీ, ఏంఎంసీల నిర్మాణం మొదలుపెట్టాలి, ఆగస్టుకల్లా పూర్తిచేయాలి:

ఉపాధిహామీ కింద మొదలుపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్స్‌ను వెంటనే పూర్తిచేయాలి:


*ఇళ్లపట్టాలు:*

అక్కడక్కడా మిగిలిపోయిన ఇళ్లపట్టాల పంపిణీని పూర్తిచేయాలి: సీఎం

అలాగే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వారికి 90 రోజుల్లోగా పట్టాలు ఇవ్వాలి:

కచ్చితంగా నిర్ణీత సమయంలోగా అర్హులైన వారికి ఇంటిస్థలం పట్టా అందాలి:

కొత్తగా అర్హులుగా గుర్తించిన 11,334 మందికి పట్టాలను కూడా వెంటనే అందించాలి:

మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్‌కూడా పూర్తిచేయాలి:

ఏప్రిల్‌ నుంచి వీరికి అవసరమైన భూముల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియలపై దృష్టిపెట్టాలి:


*తొలివిడత ఇళ్ల నిర్మాణం*

తొలివిడతలో 15.60లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం:

దీనికి సంబంధించిన అన్నిరకాల ప్రక్రియలను పూర్తిచేయాలి:

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను ముమ్మరం చేయాలి:

లే అవుట్లలో నీళ్లు, కరెంటును వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి:

ఏప్రిల్‌ 15 కల్లా ఈ లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి:

ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది:

ప్రతి కాలనీలో ఒక మోడల్‌హౌస్‌ కట్టాలి:

తామే ఇళ్లు కట్టుకుంటామన్న వారికి నిర్మాణ సామగ్రిని అందించాలి:

పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిర్మాణ సామగ్రిని కొనుగోలుచేస్తున్నందున లబ్దిదారులకు తక్కువ ధరకు సిమ్మెంటు, స్టీలు, మెటల్‌ లాంటి నిర్మాణ సామగ్రి లభిస్తుంది, వారికి మేలు జరుగుతుంది:

గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వాలంటీర్లు.. ఇలా వీరి సేవలను వాడుకోవాలి:


*నాడు – నేడు : స్కూళ్లు*

స్కూళ్లలో మొదటి విడత మార్చి 31 నాటికి నాడు నేడు పనులు పూర్తికావాలి:

10 రకాల సదుపాయాలు నాడు – నేడు కింద స్కూళ్లకు సమకూరుతున్నాయి:

పెయింట్‌ పనులపై కాస్త దృష్టిపెట్టాలి: అధికారులకు సీఎం ఆదేశం


వైయస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ కింద అంగన్‌వాడీల్లో కూడా నాడు–నేడు పనులు చేపడుతున్నాం:

6 ఏళ్లలోపు వయసులో 80శాతం వరకూ మెదడు అభివృద్ది చెందుతుంది:

అందుకనే ఈవయసులో ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టిపెట్టాం: సీఎం

ఇందు కోసం ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాం:

కొన్ని చోట్ల భవనాల నిర్మాణం కోసం స్థలాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:

అంగన్‌వాడీలకు ఇవ్వనున్న శిక్షణపై కూడా అధికారులు దృష్టిపెట్టాలి:


*మల్పీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు*

ఆర్బీకేల పరిధిలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను పెడుతున్నాం:

మల్టీపర్పస్‌ సెంటర్లకోసం 50 సెంట్ల నుంచి ఒక ఎకరం వరకూ స్థలం కావాలి:

వీలైనంత త్వరగా భూములను గుర్తించి సంబం«ధిత శాఖకు అప్పగించాలి:

గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాంలాంటి సదుపాయాలు గ్రామాల స్థాయి వరకూ రావాలి:

రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు రావాలంటే.. ఈ సదుపాయలు రావాలి:


*మెడికల్‌కాలేజీల నిర్మాణం:*

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌కాలేజీని తీసుకు వస్తున్నాం: 

బోధనాసుపత్రితోపాటు నర్సింగ్‌ కాలేజీ కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం:

కాలేజీలకు భూములను గుర్తించి, వాటిని సేకరించే పనులు పూర్తిచేయాలి:

పులివెందుల, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, ఆదోని, మచిలీపట్నంల్లో ఆరు చోట్ల ముందస్తుగా నిర్మాణాలు 

ఏప్రిల్‌లో మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం:


*జాతీయ రహదారులు*

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించాలి:

దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:

ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశం


*వైయస్సార్‌ బీమా, జగనన్న తోడు*

బ్యాంకులు ఎన్‌రోల్‌ చేయని కుటుంబాల్లో సహజ మరణాలు, ప్రమాదాల కారణంగా మరణించిన 12039 మంది నామినీలకు ఏప్రిల్‌ 6న పరిహారం చెల్లింపు: సీఎం

జగనన్న తోడు కింద అర్హులైన వారందరికీ కూడా స్కీం వర్తించాలి:

దీనికోసం ప్రత్యేక డీసీసీల సమావేశం ఏర్పాటు చేసుకోవాలి:


*వైయస్సార్‌ చేయూత, ఆసరా*

వైయస్సార్‌ చేయూత, ఆసరాల కింద కూడా దృష్టిపెట్టాలి: సీఎం

98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు:

మిగిలిన 2 శాతం మందిచేత కూడా దుకాణాలు పెట్టించేలా చర్యలు తీసుకోవాలి:

చేయూత, ఆసరాల కింద సుస్థిర ఉపాధి మార్గాలకోసం చేపట్టిన ఇతర కార్యక్రమాల్లో బ్యాంకు లింకేజీ ప్రక్రియను ముమ్మరం చేయాలి:


*పంటలకొనుగోలు:*

రబీలో పంటల కొనుగోలు ప్రారంభం అవుతుంది:

దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి:

పంటలకొనుగోలు కోసం తీసుకొచ్చిన ‘‘సీఎం’’ యాప్‌ సమర్థవంతంగా పనిచేసేలా చూడాలి:

1907 కాల్‌ సెంటర్‌ సమర్థవంతగా పనిచేయాలి:

తన పంటకు ధర రావడంలేదని రైతు చెప్తే.. వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలి:

ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభం అయ్యింది:

ఆర్బీకేల పరిధిలో ధాన్యం కొనుగోలుకు రైతుల రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయాలి:

ప్రతి ఆర్బీకే పరిధిలో ఇ–క్రాప్‌ చేయించుకున్న రైతుల జాబితాలను సోషల్‌ఆడిట్‌ కోసం ఉంచాలి:

పంటలకు ఇస్తున్న కనీస గిట్టుబాటు ధరల వివరాలను కూడా ఆర్బీకే పరిధిలో ఉంచాలి:

ఫాంగేట్‌ వద్దే కొనుగోళ్లు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:


*ఖరీప్‌ విత్తన పంపిణీ*

ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటినుంచే విత్తనాల పంపిణీ మీద దృష్టిపెట్టాలి:

రైతుల అవసరాలకు తగిన విధంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలి:

ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా నాణ్యమైనవి అందాలి:

ఆర్బీకేలు, మండలాలు, జిల్లాల స్థాయిలో వ్యవసాయ సలహామండలి సమావేశాలు జరగాలి:

ఏ పంటకు మార్కెటింగ్‌ లభిస్తుందన్న దానిపై రైతులకు మార్గదర్శనం చేయాలి:


*సాగునీటి కొరత రాకూడదు*

సాగు నీటి సరఫరాలో ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు:

ఎక్కడా కూడా ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదనే మాట రాకూడదు : 

ఆ మేరకు పూర్తి సన్నద్దంగా ఉండండి:

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశం :

ఈ మేరకు కలెక్టర్లు జలవనరుల శాఖతో సమన్వయం చేసుకోవాలి:


*ఏప్రిల్‌  2021లో ముఖ్యమైన కార్యక్రమాలను వెల్లడించిన సీఎం:

ఏప్రిల్‌ 9న జగనన్నవిద్యాదీవెన : 

ఏప్రిల్‌ 13, ఉగాదిరోజున వలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం:

ప్రతిరోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలి:

వలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరించాలి:

వలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి:

అది వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది:

ఏప్రిల్‌ 16న రైతులకు వైయస్సార్‌ సున్నావడ్డీ డబ్బులు:

ఏప్రిల్‌ 20న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ డబ్బులు:

ఏప్రిల్‌ 27న జగనన్న వసతి దీవెన:

ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోండి: సీఎం ఆదేశం

పెండింగులో ఏమైనా దరఖాస్తులు ఉంటే పరిశీలన చేసుకోండి:

జాబితాలను సచివాలయల్లో ఉంచండి:

అర్హులకు అందేలా చర్యలు తీసుకోండి:

కలెక్టర్లకు సీఎం స్పష్టమైన ఆదేశాలు


స్పందన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సీసీఎల్‌ఏ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆర్‌ అండ్‌ బి ఎం టి కృష్ణబాబు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ గృహనిర్మాణశాఖ అజయ్‌ జైన్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బీసీ వెల్ఫేర్‌ జి అనంతరాము, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏ ఆర్‌ అనురాధ,  వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి ఉషారాణి, కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి ఉదయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె సునీత, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్‌, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హెచ్‌ అరుణకుమార్, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్‌, సెర్ప్ సీఈఓ రాజబాబు, ఇతర ఉన్నతాధికారులు.

Comments