కర్నూలు (ప్రజా అమరావతి);
మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల ఖర్చులు, ఓటర్లకు తాయిలాలపై గట్టి నిఘా పెట్టండి: మున్సిపల్ కమీషనర్లకు, ఫ్లయింగ్, ఎస్.ఎస్.టీ టీమ్స్ కు కలెక్టర్ వీరపాండియన్ అదేశం.
మునిసిపల్ ఎన్నికలను సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేద్దాం :కలెక్టర్ వీరపాండియన్.
ఎన్నికల సక్సెస్, సమన్వయం కోసం ప్రతి మున్సిపాలిటీకి అదనంగా ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఈఓ ఆర్డీలు నియామకం:కలెక్టర్ వీరపాండియన్.
పోలింగ్ విధులకు గైర్హాజరైతే సస్పెన్షన్ : కలెక్టర్ వీరపాండియన్.
మున్సిపల్ ఎన్నికల ట్రైనింగ్ కు గైర్హాజరైన పిఓ/ఎపిఓలు 172 మందికి షోకాజ్ నోటీసులు జారీ: కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్.
ఓటరు స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్ డిస్పాచ్ ను ఆదివారం లోపు పూర్తీ చేయండి: కలెక్టర్ వీరపాండియన్.
ఓటరు అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ఓటింగ్ శాతాన్ని పెంచడానికి చర్యలు చేపట్టండి: కలెక్టర్ వీరపాండియన్.
పోలింగ్ తో పాటు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు కూడా పగడ్బందీగా పూర్తీ చేయండి..ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక మీడియా సెంటర్ ఏర్పాటు చేయండి: కలెక్టర్ వీరపాండియన్.
పోలింగ్, కౌంటింగ్, ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది లేకుండా మూడు పూటలా మంచి ఆహారాన్ని అందించండి: మున్సిపల్ కమీషనర్లకు కలెక్టర్ వీరపాండియన్ అదేశం.
ఆదివారం నాడు నంద్యాల, ఆళ్ళగడ్డ మునిసిపాలిటీ లలో పర్యటించి.. ఎన్నికల ఏర్పాట్లను తనిఖీ చేయనున్న కలెక్టర్ వీరపాండియన్.
గత మూడు రోజుల నుండి ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు మునిసిపాలిటీలలో విస్తృతంగా పర్యటించి మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను తనిఖీ పూర్తీ చేసిన కలెక్టర్ వీరపాండియన్.
ప్రతి రోజూ రాత్రి 7 నుండి 9 గంటల వరకు టెలి కాన్ఫరెన్సు ద్వారా మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లను జేసీలతో కలిసి మున్సిపల్ కమీషనర్లతో, జిల్లా నోడల్ టీమ్స్ తో సమీక్ష చేస్తూ దిశా నిర్దేశం చేస్తున్న కలెక్టర్ వీరపాండియన్.
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికారులందురు కలిసి ఒక టీమ్ గా కలిసికట్టుగా పని చేయడం వల్ల కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం సాధ్యమైందని...అదే స్ఫూర్తితో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేద్దామని ఎన్నికల నిర్వహణ అధికారులకు జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ సూచించారు.
శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహణ సన్నద్ధత పై జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ మున్సిపల్ కమిషనర్ లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, ఆర్ డిఓలు, తహశీల్దార్ లు, ఎంపిడిఓలు, నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
టెలికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డి ఆర్ ఓ పుల్లయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, ఆర్ డి ఓ లు, మున్సిపల్ కమిషనర్ లు, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఓటర్ లకు ఓటర్ స్లిప్ లు పంపిణీ వంద శాతం పూర్తి కావాలన్నారు. బ్యాలెట్ పేపర్ లు వేరిపీకేషన్ వెంటనే పూర్తి చేసుకొని పోలింగ్ మెటీరియల్ ను సిద్ధం చూసుకోవాలన్నారు. అలాగే బ్యాలెట్ బాక్స్ లు ఎక్కడ కొరత లేకుండా కావాల్సిన బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం చేసుకొని ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లను పోస్ట్ ద్వారా పంపిణీ చేయడం వెంటనే పూర్తి కావాలన్నారు. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలలో ట్రైనింగ్ గైర్హాజరైన పిఓ/ఎపిఓలకు 172 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వకపోతే సిసిఈ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైనింగ్, ఎన్నికల విధులకు ఎవరు కూడా గైర్హాజర్ కాకూడదు అన్నారు. పోలింగ్ విధులకు గైర్హాజరైతే ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
addComments
Post a Comment