క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌), జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.



క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌), జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.



అమరావతి (ప్రజా అమరావతి):

క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి అధికారులకు సీఎం ఆదేశం

ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు చర్యలు :

ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ :

ప్రతి వార్డుకు 2 చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 8వేల ఆటోమేటిక్ ట్రక్కులు కొనుగోలు :

జులై 8న వాహనాల ప్రారంభం :

చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్, కెమెరాల ఏర్పాటు:

ప్రతి వీధి చివర కూడా డస్ట్ బిన్‌ ఏర్పాటు :

సేకరించిన తడి, పొడి చెత్తను ప్రాససింగ్‌ చేసేలా ఏర్పాట్లు :

అలాగే వ్యర్థజలాల శుద్ధికోసం ట్రీట్‌ మెంట్‌ప్లాంట్ల ఏర్పాటు :

రూరల్‌ ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్న సీఎం


జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా సీఎం సమీక్ష.


జగనన్న కాలనీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష

జగనన్న కాలనీల్లో రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైన్లు, తాగునీటి సరఫరా, కరెంటు,  పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకోసం, మొత్తంగా రూ.30,691 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా

సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కలిపి 33,406 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా

జగనన్నకాలనీ పనుల్లో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైనది: సీఎం

ప్రతి పనిలో కూడా క్వాలిటీ కనిపించాలి: అధికారులకు సీఎం ఆదేశం


*విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం సమీక్ష*


భోగాపురం ఎయిర్‌పోర్టు, బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్‌ద్వారా విశాఖకు తరలింపు... మూడు పనులను శరవేగంగా ప్రారంభించాలని సీఎం ఆదేశాలు

నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం

దీని తర్వాత మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు


విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్‌రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్‌ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చ

ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు

రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేయాలన్న సీఎం

భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు వెల్లడించిన అధికారులు

బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదిక చేపట్టాలని సీఎం ఆదేశం

దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలని సీఎం ఆదేశాలు

దీన్ని మొదట ప్రాధాన్యత పనిగా గుర్తించాలని సీఎం ఆదేశాలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు


విశాఖకు గోదావరి జలాలు.

పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖనగరానికి తరలింపుపై సీఎం సమీక్ష

పైపులైన్‌ద్వారా నీటిని తరలించడంపైనా సీఎం సమీక్ష

రానున్న 30 ఏళ్లకాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక

పైపులైన్‌ ప్రాజెక్ట్‌ను కూడా ప్రాధాన్యతగా చేపట్టాలని సీఎం ఆదేశాలు


విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌పై సీఎం సమీక్ష.


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి భోగాపురం వరకూ మెట్రో ప్రతిపాదన

మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం

53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు 

దీంతో పాటు 60.2 కి.మీ. మేర ట్రాం కారిడార్‌

మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీ. కారిడార్‌

కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా

ట్రాం సర్వీసులకు మరో రూ.6వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా

ట్రాం, మెట్రోల ఏర్పాటుకు మొత్తంగా రూ.20వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా

సీఎంకు వివరాలు అందించిన అధికారులు

మెట్రో, ట్రాం నిర్మాణ శైలిలో మంచి డిజైన్లు పాటించాలన్న సీఎం

నగరానికి అందం తీసుకొచ్చేలా ఉండాలని, నగరానికి ఆభరణంలా ఉండాలని స్పష్టం చేసిన  సీఎం


ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు నీలం సాహ్ని, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ,  పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, విశాఖ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌ పి రామకృష్ణా రెడ్డి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Comments