ఆంధ్రప్రదేశ్ లో 'జర్మనీ' పెట్టుబడులు : ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



ఆంధ్రప్రదేశ్ లో 'జర్మనీ' పెట్టుబడులు : ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



తయారీ, ఉత్పత్తి, నైపుణ్యం, వైద్యం, సేంద్రీయ వ్యవసాయం, సౌరవిద్యుత్ రంగాలలో జర్మనీకి పెట్టుబడులకు జర్మనీ పెద్దపీట.


25న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం.


త్వరలోనే నెల్లూరు జిల్లా విమానాశ్రయం అభివద్ధి.


స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం నుంచి ప్రతిపాదనలేవీ లేవు.


గంగవరం పోర్ట్  అదానీ చేతికి వెళ్లడం వల్ల ఏపీలో మరిన్ని పెట్టుబడులు.


విజయవాడ ఏపీటీఎస్ కార్యాలయంలో జర్మనీ కాన్సులేట్ జనరల్ తో భేటీ అనంతరం మంత్రి మేకపాటి.


ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల మార్గంలో పయనిస్తోంది : జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్  స్టోల్.


అమరావతి, మార్చి, 23 (PRAJa అమరావతి);  ఆంధ్రప్రదేశ్ లో జర్మనీ పరిశ్రమలు, పెట్టుబడులకు అవకాశమున్న మార్గాలు అపారంగా ఉన్నాయని ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. జర్మనీ పెట్టుబడులకు పెద్దపీట వేసే తయారీ, ఉత్పత్తి, నైపుణ్యం, వైద్యం, సేంద్రీయ వ్యవసాయం, సౌరవిద్యుత్ రంగాలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఆర్ అండ్ బీ భవనంలోని ఏపీటీఎస్ కార్యాలయంలో మంగళవారం  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్ తో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం గురించి మంత్రి మేకపాటి జర్మనీ కాన్సుల్ జనరల్ కు వివరించారు. అనంతరం మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జర్మనీ కాన్సులేట్ జనరల్ అడిగి తెలుసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యంపై ప్రధానంగా దష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. ఈ రంగంలో జర్మనీ ఇప్పటికే భాగస్వామ్యమైందన్నారు. 


పెట్టుబడులకు అవకాశాలున్న  మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతోందని జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్ వెల్లడించారు. నైపుణ్య రంగంపై దష్టి పెట్టడం మంచి పరిణామమన్నారు, 

ప్రపంచమంతా  మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉందన్నారు. ఈ రంగంలోనే మరిన్ని పరిశోధనలు కూడా జరగాల్సి ఉందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అంతకుముందు పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ కు ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి ప్రజంటేన్ ఇచ్చారు. 

స్టార్టప్, ఈమీఎసీలలో భాగస్వామ్యమయితే బాగుంటుందని ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ వెల్లడించారు. పీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించే ఇన్సెంటివ్ ల గురించి ఎండీ నందకిశోర్ వివరించారు. 


విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి, జర్మనీ కాన్సులేట్ జనరల్ ల సమావేశానికి హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ వీ.ఆర్.వీ.ఆర్. నాయక్, ఈడీబీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ కృష్ణ జీవీ గిరి, ఐ.టీ సలహాదారు విద్యాసాగర్ రెడ్డి,  ఈడీబీ బృందం తదితరులు హాజరయ్యారు.


త్వరలోనే నెల్లూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి.


కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న ప్రారంభిస్తారని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. త్వరలోనే నెల్లూరు జిల్లా ఎయిర్ పోర్టును కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. 28వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతుయన్నారు. విజయవాడ సహా మరిన్ని నగరాలకు కూడా ప్రయాణం చేసే వెసులుబాటుకు త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. 


గంగవరం పోర్టు వల్ల ఏపీలో ఎక్కువ పెట్టుబడులు :  మంత్రి గౌతమ్ రెడ్డి.


గంగవరం పోర్టు అదాని చేతికి వెళ్లడం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి మేకపాటి సమాధానమిచ్చారు. అదానీ దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక వేత్త కావడం వల్ల దేశవ్యాప్తంగా పోర్టు అభివృద్ధిలో భాగస్వామ్యమవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు పోర్టుల్లో పెట్టుబడులు పెట్టారని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశాలున్నాయని, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా విషయంలో ఎటువంటి  మార్పు ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.


*విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రిది స్పష్టమైన నిర్ణయం : మంత్రి మేకపాటి*


విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని మంత్రి మేకపాటి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ ఇప్పటికే స్పష్టంగా లేఖ రాశారని మంత్రి తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్పష్టంగా  సీఎం నిర్ణయం స్ఫష్టంగా తీసుకున్నారన్నారు. ప్రధాన మంత్రి మోదీ కలిసే అవకాశం ఇవ్వగానే అఖిలపక్షాన్ని వెంట తీసుకుని సీఎం ఢిల్లీ వెళతారని మంత్రి వెల్లడించారు.



Comments