రాష్ట్ర ముఖ్యమంత్రికి... కడప ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం!
కడప, మార్చి 28 (ప్రజా అమరావతి): కడప పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కడప విమానాశ్రయం చేరుకున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తోపాటు.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డిసిసి ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు సంబటూరు ప్రసాద్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ.. ఆదివారం ఉదయం ఆకస్మిక మరణం పొందిన బద్వేలు శాసన సభ్యులు డా. వెంకట సుబ్బయ్య పార్థీవదేహాన్ని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు.. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సా.4.15 గంటకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటుతో కడప జిల్లా ఇంఛార్చి మంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్, సహాయ వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వర రెడ్డి వున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కడప నగరంలోని ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య నివాసంనకు బయలుదేరి వెళ్లారు.
దివంగత ఎమ్మెల్యే పార్థివదేహానికి నివాళులర్పించి... వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం సాయంత్రం 5.00గం.లకు కడప విమానాశ్రయానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి 5.35గం.లకు గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.
కోవిడ్ నేపథ్యంలో కడప విమానాశ్రయంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SoP) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్, జేసీ ధర్మచంద్రారెడ్డి (సంక్షేమం), ఎయిర్ పోర్టు డైరెక్టర్ శివ ప్రసాద్, కమలాపురం, వల్లూరు తహశీల్దార్లు, పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment