హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న అభయం.
తిరుపతి (ప్రజా అమరావతి) : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీనివాసుడు కోదండరాముని అలంకారంలో కటాక్షించారు.
శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం, సాయంత్రం 4.20 గంటలకు స్వర్ణరథానికి బదులుగా బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయుడు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
addComments
Post a Comment