శాసన మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం

 శాసన మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం



అమరావతి,మార్చి24 (ప్రజా అమరావతి) : శాసన మండలిలో ఇద్దరు శాసన మండలి సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పోతుల సునీత,చల్లా భగీరధరెడ్డిలచే ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇద్దరికీ అభినందనలు తెలిపి,శాసన పరిషత్తు నియమ నిబంధనలు తెలుపుతూ ధృవీకరణ పత్రాలు,బుక్ లెట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు కరీమున్నీసా,అసెంబ్లీ సహాయ కార్యదర్శి విజయరాజు, వొఎస్డి కె.సత్యనారాయణ,అసిస్టెంట్ సెక్రటరీలు  తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మండలి ఛైర్మన్

శాసన మండలి ఆవరణలో మండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్ బుధవారం కోవ్యాక్జిన్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ లో ఉన్న పలువురు సహాయ కార్యదర్శులు,అసిస్టెంట్ కార్యదర్శులు,ఉద్యోగులు,మార్షల్స్ కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో గుంటూరు డిఎంహెచ్ వొ యాస్మిన్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రత్నమన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


Comments