టీడీపీ నేతలపై జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలు...


అమరావతి (ప్రజా అమరావతి);

టీడీపీ నేతలపై జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలు...


సంబంధం లేని అంశంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నా...


శ్రీ నారా చంద్రబాబునాయుడు


         రాష్ట్రంలో జగన్ రెడ్డి చర్యలతో ప్రజాస్వామ్యం పతనం అవుతోంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో, అప్రజాస్వామిక విధానాలతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. వికృత రాజకీయాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తెలుగుదేశం పార్టీ నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సంబంధం లేని అంశంలో అక్రమంగా కేసు నమోదు చేసి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమ కేసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అక్రమ కేసులతో, రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేవు. అధికారం శాశ్వతం కాదు.. ఇంతకింత అనుభవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. వెంటనే రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి బేషరతుగా ఆయనను విడుదల చేయాలి. 



                                                              శ్రీ నారా చంద్రబాబునాయుడు

                                                         తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,

                                                                      ప్రధాన ప్రతిపక్ష నేత

Comments