అమరావతి (ప్రజా అమరావతి);
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్ జగన్.
*అన్ని పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్‌డెస్క్‌లను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం*
*సీఎం శ్రీ వైఎస్ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రకాశం జిల్లా ఒంగోలు ఒన్‌టౌన్ పిఎస్ నుంచి విమెన్ హెల్ప్ డెస్క్‌లో మహిళా కానిస్టేబుల్ అలేఖ్య*
భాదిత మహిళ తన సమస్యను చెప్పగానే మేం ఒక మహిళగా తన బాధను అర్ధం చేసుకుని సత్వర న్యాయం చేయగలుగుతాం. అలాగే ఒక నిరక్షరాస్యురాలైన మహిళ స్టేషన్‌కు వస్తే ఆమెకు రాయడం రాదు కాబట్టి వారు చెప్పిన ప్రతీ మాటను రికార్డ్ చేసి వారికి చదివి వినిపించి న్యాయం చేస్తాం. అలాగే మానసిక సమస్యలతో భాదపడే వారు వచ్చినప్పుడు వారికి కౌన్సిలింగ్ చేయడంతో పాటు పూర్తిగా సహకరిస్తాం. హెల్ప్‌డెస్క్‌లో మహిళలు ఉండడం వల్ల మేం పూర్తిగా వారి బాధలు అర్ధం చేసుకుని సత్వర న్యాయం చేయగలుగుతాం.
మా మహిళలకోసం మీరు చాలా చేస్తున్నారు సార్, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి వృద్దాప్యం వరకూ మీరు ప్రతీ విషయంలో మాకు తోడుగా ఉంటున్నారు. బిడ్డలకు మేనమామగా, చదువుల విషయంలో అన్నలాగా, చేయూతనిస్తూ పెద్దన్నలా తోడుగా, వృద్దాప్యంలో కొడుకుగా ఉంటున్నారు. మీరు మా కుటుంబసభ్యులై ప్రతీ విషయంలో తోడుగా ఉంటున్నారు. ధన్యవాదాలు సర్.
*కర్నూల్ టూటౌన్ పిఎస్ ఉమెన్ హెల్ప్ డెస్క్‌లో మహిళా కానిస్టేబుల్ దుర్గ*
మీరు ఏర్పాటుచేసిన దిశ పోలీస్ స్టేషన్ మహిళలకు ఒక వరం, స్టేషన్‌కు వచ్చే మహిళలకు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఇబ్బందులు పడుతున్న వారికి మేమున్నామనే భరోసా ఇచ్చే అవకాశం దిశ పోలీస్ స్టేషన్ ద్వారా కలుగుతుంది. దిశా యాక్ట్ మహిళా మిత్ర ద్వారా మహిళలకు భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
*మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మంత్రులతో కేక్ కటింగ్*
– మహిళా మంత్రులతో స్వయంగా కేక్ కట్ చేయించిన సీఎం
– మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రూపొందించిన దేశానికి దిశ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
– దిశ సైబర్ కియోస్క్‌ను ఆవిష్కరించిన సీఎం
– 18 దిశ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్ వెహికల్స్, 900 దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన సీఎం
– 58 ఫోరెన్సిక్స్ ల్యాబ్స్‌లో సైంటిఫిక్ ల్యాబ్ అసిస్టెంట్‌ల ఫలితాలు విడుదల చేసిన సీఎం
– ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే స్వేఛ్చ కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లు విడుదల చేసిన సీఎం
– అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఏఎన్‌ఎం శాంతి, పారిశుద్ధ్య కార్మికురాలు మాబున్ని, మహిళా కానిస్టేబుల్ సరస్వతి, వలంటీర్ కళ్యాణిలను సత్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
addComments
Post a Comment