ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.



అమరావతి (ప్రజా అమరావతి):


ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.



విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం

రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై ఇస్తున్న కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్న కరెంటు సరఫరాపై సీఎం సమీక్ష

ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటికి నిధులను సకాలంలో విడుదల చేయాలని సీఎం ఆదేశం

ఆ మేరకు ప్రణాళిక వేసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు ఆదేశం


కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్‌ యూనిట్లను వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం

యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలంపాటు కొనసాగితే.. అవి భారంగా తయారవుతాయన్న సీఎం

సత్వరమే నిర్మాణాలు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందన్న సీఎం


*వేసవి దృష్ట్యా విద్యుత్‌ ఉత్పత్తిపై సీఎం సమీక్ష*

వచ్చే మూడు, నాలుగు నెలల్లో విద్యుత్ కొరత లేకుండా చూసుకొండి : అధికారులకు సీఎం ఆదేశం

అవసరాలకు అనుగుణంగా ఎంత మేరకు విద్యుత్ కావాలో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకొండి : సీఎం


జెన్‌ కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15 యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలి:  సీఎం 

బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం


ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇంధనశాఖ ఎక్స్ అఫిసియో ప్రిన్సిపల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్‌,  ఇంధనశాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Comments