గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానాన్ని 10 వేల మెజార్టీతో కైవసం చేసుకుంటాం గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానాన్ని 10 వేల మెజార్టీతో కైవసం చేసుకుంటాం 

 బహిష్కరణ అంటూనే ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు 

 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 

గుడ్లవల్లేరు మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం గుడివాడ , ఏప్రిల్ 5 (ప్రజా అమరావతి) : గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానాన్ని 10 వేల మెజార్టీతో కైవసం చేసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడ్లవల్లేరు మండలం కవుతరం గ్రామంలో మంత్రి కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు . జడ్పీటీసీ అభ్యర్ధిని ఉప్పాల హారిక , కవుతరం రెండు సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థినులు ఈడే లక్ష్మి , ఎస్ దుర్గాభవాని , డోకిపర్రులోని రెండు సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్ధులు కొడాలి సురేష్ , మేరుగు నాగేంద్రరావులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు . అనంతరం జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్ధినిగా ఉప్పాల హారికను నిలబెట్టామని చెప్పారు . గత ఏడాది కాలంగా ఇక్కడి ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు . కరోనా విపత్కర పరిస్థితుల్లో అనేక సేవాకార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు . తమ అభ్యర్ధి ఉప్పాల హారిక ప్రజా సేవ చేస్తుందనే నమ్మకం ప్రజలకు కల్గిందన్నారు . జడ్పీ , ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నామన్నారు . అన్నివర్గాల ప్రజల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తోందన్నారు . టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కొత్త నాటకానికి తెర తీశారని చెప్పారు . జడ్పీ , ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్టు ఒకవైపు చెబుతూనే మరోవైపు జడ్పీటీసీ , ఎంపీటీసీ అభ్యర్థులతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారన్నారు . ప్రజలంతా దీన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు . ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని స్పష్టంగా తెలుసన్నారు . ఎన్నికలను బహిష్కరిస్తే కుంటి , గుడ్డి సాకులను ఎత్తి చూపుతూ బహిష్కరించడం వల్లే ఓటమి ఎదురైందని చెప్పుకోవచ్చన్న ధోరణిలో చంద్రబాబు ఉన్నారన్నారు . చంద్రబాబు , ఆయన పార్టనర్ పవన్ కళ్యాణ్ వచ్చినా విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు . సీఎం జగన్మోహనరెడ్డి చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారన్నారు . దీనివల్ల నూటికి 70 శాతం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్నారు . గతంలో ఎన్నడూ లేని విధంగా గుడ్లవల్లేరు మండలంలో జడ్పీటీసీ , ఎంపీటీసీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో విజయం సాధిస్తారని మంత్రి కొడాలి నాని చెప్పారు .

ఇదిలా ఉండగా మంత్రి కొడాలి నాని దృష్టికి కవుతరం గ్రామస్థులు పలు సమస్యలను తీసుకువచ్చారు . రోడ్లు , డ్రైన్లు , మంచినీటి సౌకర్యం వంటి సమస్యల పరిష్కారంపై మంత్రి కొడాలి నాని మాట్లాడారు . కవుతరంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు . కాగా మంత్రి కొడాలి నాని ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు . ప్రచారంలో భాగంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . మసీదులోని జెండాల దగ్గర ముస్లిం మత పెద్దలతో కలిసి మంత్రి కొడాలి నాని ప్రార్థనలు చేశారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలేటి చంటి , పాలడుగు రాంప్రసాద్ , ఉప్పాల రాము , పార్టీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవికుమార్ , శ్రీ కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి , కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమట సుజాత , నాయకులు వడ్లమూడి నాగమోహన్ , వడ్లమూడి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు .

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image