విజయవాడలో మంగళవారం (13.4.21)న కరోన పరీక్షలు 

 విజయవాడ (prajaamaravathi)  విజయవాడలో మంగళవారం (13.4.21)న కరోన పరీక్షలు నిర్వహించేందుకు 3 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్ శివశంకర్ సోమవారం రాత్రి ఒక ప్రకటన లో తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాల్ రావు ఇండోర్ స్టేడియంలో, గుణదల చర్చి ప్రాంగణంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఎటువంటి కోవిడ్ లక్షణాలు ఉన్నా వెంటనే ఆయా కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయించు కోవాలని ఆయన కోరారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం చేయాలన్నారు.

Comments