కొల్లిపర గ్రామంలో గత 15 రోజులుగా కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయ

 కొల్లిపర ఏప్రిల్ 9 (ప్రజా అమరావతి); కొల్లిపర గ్రామంలో గత 15 రోజులుగా కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయ


ని విలేకర్ల సమావేశంలో మండల తాహాసిల్దార్ జి. నాంచారయ్య మాట్లాడుతూ కేసులు పెరుగుదలను కట్టడి చేసేందుకు ప్రచార అవగాహన , కార్యక్రమాలు చేపట్టినప్పటికీ జనసామాన్యంలో అలసత్వం నిర్లక్ష్యం వలన అదుపు కావటంలేదు. ఈ నేపథ్యంలో covid - 19 కట్టడి కోసం జనసంచారం వ్యాపార వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేయడమైనది. తేదీ 14-4- 2021 నుంచి 16 -4- 2021 వరకు వారం రోజుల పాటు కొల్లిపర గ్రామం, తూములూరు, దావులూరు అడ్డరోడ్డు మెడికల్ షాపులు, పాల విక్రయ కేంద్రాలు మినహా మిగతా అన్ని వ్యాపారా, వాణిజ్య సముదాయాలు దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతించబడిన ఉన్నది. టీ, టిఫిన్ సెంటర్లో మరియు హోటళ్లను వారం రోజుల పాటు పూర్తిగా మూసి వేయాల్సిందిగా ఆదేశించడం అయినది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎం డి ఓ పి శ్రీనివాసులు, కొల్లిపర ఏ. సై. బలరామిరెడ్డి , సర్పంచ్ పిల్లి. రాధిక, వై ఎస్ ఆర్ సి పి. నాయకులు భీమవరపు. సంజీవరెడ్డి, భీమవరపు. కోటీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments