వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 2020 రబీకి సంబంధించిన వడ్డీ రాయితీ విడుదల సందర్బంగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:.
 


వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 2020 రబీకి సంబంధించిన వడ్డీ రాయితీ విడుదల సందర్బంగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:.


అమరావతి (ప్రజా అమరావతి);


రాబోయే తరాలకు కూడా మీరే సీఎంగా వుంటారు: *సిహెచ్‌ శ్రీనివాస్, త్రిపురాంతకం మండలం, దువ్వల గ్రామం, ప్రకాశం జిల్లా*: 

– ‘నాకు మా పెద్దలు ఇచ్చిన నాలుగున్నర ఎకరాల భూమి వుంది. రెండు ఎకరాల్లో పత్తి, రెండున్నర ఎకరాల్లో కంది పంట సాగు చేస్తున్నాను. వాటి కోసం బ్యాంకు నుంచి రూ.90 వేలు లోను ఇచ్చారు. వాటిని  సకాలంలో చెల్లించినందుకు ఇప్పుడు నాకు ఆర్బీకెలో పెట్టిన లిస్ట్‌లో నా పేరు కింద సున్నా వడ్డీ కింద రూ.3600 జమ అవుతున్నట్లు ఉంది. రేపు రాబోయే శ్రీరామనవమి ఈరోజే వస్తోందనే సంతోషం కలుగుతోంది. నాకు రెండు సార్లు రైతు భరోసా అందింది. మే నెలలో మరో విడత అందబోతోంది. ఆ డబ్బుతో విత్తనాలు, పురుగు మందులు నాకు నచ్చిన చోట కొనుగోలు చేస్తాను. అంతకు ముందు అప్పు కింద అయితే వ్యాపారుల వద్దకు పోతే ఈ రకమే వుంది, ఈ రేటుకే ఇస్తామని ఎక్కువ రేటుకు, తక్కువ నాణ్యత వుండే విత్తనాలు ఇచ్చేవారు. వాటినే వాడే వాళ్ళం. అవి సరిగా పండేవి కాదు. ఇప్పుడు అలా కాదు, మా డబ్బుతో మంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నాం. మంచి దిగుబడులు సాధిస్తున్నాం. రైతుభరోసాలో విత్తనాలు, పురుగుమందులు, నాణ్యమైనవి తీసుకుంటున్నాం. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్ళే వాళ్ళం. వాటిని తెచ్చుకునేందుకు రవాణా చార్జీలు అయ్యేవి. ఇప్పుడు మా ఊరిలోనే ఆర్బీకెలు ప్రారంభించారు. అక్కడే అన్ని లభిస్తున్నాయి. గతంలో దళారులు నిర్ణయించిందే రేటుగా వుండేది. ఇప్పుడు ఆర్బీకెల్లో గిట్టుబాటు రేటును ప్రకటిస్తున్నారు. దళారుల్లో మీరు వణుకు పుట్టిస్తున్నారు. 

గతప్రభుత్వంలో పంటల బీమా కోసం ఒక ఎకరంకు రూ.1850 చొప్పున డిడి తీశాం. అయినా కూడా నష్టపరిహారం సరిగా అందేది కాదు. మీరు మంచి ఆలోచనతో రైతుతో డబ్బులు ఎందుకు కట్టించాలి, మనమే కడితే సరిపోతుందని ఒక్క రూపాయి రైతు కడితే, మిగిలింది నేను కడతాను అన్నారు. మొదటి ఏడాది మీ సేవా కేంద్రానికి వెళ్ళి రెండు ఎకరాలకు పత్తి, కందికి కట్టాను. పంటనష్ట పరిహారం కింద నా ఖాతాకు డబ్బు జమ అయ్యింది. ఇప్పుడు ఈ క్రాప్‌ కింద ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే పంటలబీమాను వర్తింప చేస్తున్నారు. ఇలా ఎవరైనా చేయగలరా? రాబోయే తరాలకు కూడా మీరే సీఎంగా వుంటారు’. 


ఆయిల్‌ఫాం రైతులను ఆదుకున్న తొలి సీఎం మీరే:

*దాట్ల వెంకటపతి, రాజానగరం మండలం, కల్వచర్ల గ్రామం, తూర్పుగోదావరిజిల్లా*:

– ‘ఈ దేశంలోనే ఆయిల్‌ పాం రైతులను ఆదుకున్న తొలి సీఎం మీరే. ధర లేక నష్టాల పాలవుతున్న ఆయిల్‌ పాం రైతులకు రూ.80 కోట్లు కేటాయించి ఆదుకున్నారు. ఇప్పుడు రైతుల కోసం నిత్యం అనేక పధకాలను అమలు చేస్తున్నారు. మాకు ఈ రోజు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద రూ. మూడువేల తొమ్మిది వందలు వచ్చింది. అలాగే రైతుభరోసా కింద మీరు అందిస్తున్న సాయంతో పెట్టుబడి అవసరాలు తీర్చుకుంటున్నాం. ఈ డబ్బుతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నాం. రుణాలు సక్రమంగా చెల్లించడం వల్ల అదనంగా వడ్డీ రాయితీ లభిస్తోంది, మరోవైపు బ్యాంకుల వద్ద పరపతి పెరుగుతోంది. ఇప్పుడు బ్యాంకులు మాకు రెండు ఎకరాలకు లక్ష వరకు రుణం ఇస్తామని చెబుతున్నాయి. రైతుల్లో జవాబుదారీతనం తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే వాళ్ళం. ఈ రోజు ఆర్బీకెల్లో అర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. రైతుకు చాలా సులువగా పరిపాలన చేస్తున్నారు. గతంలో రైతులను పట్టించుకోని పరిస్థితి వుంటే.. మీరు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆనాడు మహానేత వైయస్‌ఆర్‌ మా ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు బోర్లు వేసుకుని రైతులు పడుతున్న బాధలను చూశారు. ఆయన అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. నేడు దానిని మీరు మరింత మెరుగుపరిచారు’. 


కౌలురైతుల కష్టాలను తీరుస్తున్నారు: *శ్రీనివాసరెడ్డి, కౌలురైతు.

వల్లూరు మండలం, వైయస్‌ఆర కడప జిల్లా*:

– ‘సొంత భూమితో పాటు నేను అయిదు ఎకరాలు కౌలు చేస్తున్నాను. 2019లో ప్రభుత్వం కౌలు రైతుకార్డు ఇచ్చింది. వెంటనే బ్యాంకు ద్వారా రూ.60 వేల రుణం తీసుకుని, సకాలంలో చెల్లించాను. అందుకు గానూ రూ.2400 వడ్డీ రాయితీ వచ్చింది. ఈ విషయం తెలిసి చాలా సంతోషం అనిపించింది. కౌలుదారులకు ఎక్కడా రుణాలు ఇవ్వరు. కానీ మొదటిసారి జగన్‌ గారి ప్రభుత్వంలో లోన్‌ వచ్చింది. దానితో పాటు సున్నావడ్డీ పథకం కింద ఇప్పుడు వడ్డీ రాయితీ కూడా అందుతోంది. రూ.90 వేలకు గానూ రూ.3600 చొప్పున మా కుటుంబానికి వడ్డీ రాయితీ వచ్చింది.  గత సీజన్‌లో పంట నష్టం జరిగితే రూ.52 వేలు పరిహారంగా వచ్చింది. గతంలో ఇలా ఎప్పుడూ 80 శాతానికి పైగా పంట నష్టపరిహారం రాలేదు. ఆర్బీకెలోనే పంటలను ఈ క్రాప్‌ చేయించుకుని అమ్ముకుంటున్నాం. ఎరువులు, విత్తనాలు కూడా ఇక్కడే తీసుకుంటున్నాం. నోటిఫైడ్‌ పంటల్లో మినుము, పెసర కూడా చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను’.

కాగా, దీనిపై స్పందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెంటనే మినుము, పెసరను కూడా నోటిఫైడ్‌ పంటల్లో చేరుస్తున్నామని ఆ రైతుకు హామీ ఇచ్చారు. 


మీది చేతల ప్రభుత్వం. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి: 

*గాజుల మాధవరావు. బందరు మండలం, పొట్లపాలెం గ్రామం, కృష్ణా జిల్లా*:

– ‘రైతు కళ్ళలో వెలుగులు చూడాలని తపిస్తున్న మీరు ఎప్పుడూ సీఎంగా వుండాలి. నేను సహకార సంఘం ద్వారా రూ.98 వేలు రుణం తీసుకుని, సకాలంలో చెల్లించాను. వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద వడ్డీ రాయితీ రూపంలో నాకు తాజాగా రూ.3620 వచ్చాయి. మా కుటుంబానికే వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.12 వేల లబ్ధి కలుగుతోంది. రైతు భరోసా కేంద్రం మా గ్రామంలోనే వుంది. బ్యాంకుకు వెళ్ళకుండానే వడ్డీ రాయితీ గురించి ఆర్బీకెలోని జాబితా చూసుకుంటే వివరాలు తెలుస్తున్నాయి. గతంలో వడ్డీ రాయితీ వర్తిస్తుందా లేదో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆర్బీకె కు వెడితే చాలు. మీది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. గతంలో వడ్డీ రాయితీ కోసం కాగితాలు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్ళం. ఇప్పుడు బ్యాంకులే పిలిచి మరీ రుణాలు ఇస్తున్నాయి. ఈ డబ్బును కోతలు, మందుకట్టలకు ఉపయోగించుకుంటాం. నేను రెండు సార్లు రైతుభరోసా కింద లబ్ధి పొందాను. కౌలురైతుకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయడం చాలా గొప్ప విషయం. రైతులు మీ రుణం తీర్చుకోలేరు. ఇది రైతు ప్రభుత్వం అని రుజువు చేస్తున్నారు. గతంలో రుణం తీసుకోకపోతే పంటల బీమా వచ్చేది కాదు, ఇప్పుడు ఈ క్రాప్‌లో పంట నమోదు  చేసుకుంటే, ఆటోమేటిక్‌గా పంట దెబ్బతింటే ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో శివారు ప్రాంతమైన మాకు రెండోపంటకు నీరు వచ్చేది కాదు. పట్టిసీమ నుంచి నీళ్ళు వస్తున్నాయంటూ చెప్పేవారే కానీ, ఏనాడు మాకు నీరు అందలేదు. మీరు అధికారం లోకి వచ్చిన తరువాతే మాకు దాళ్వాకు నీరు అందుతోంది’. 


బ్యాంకులు రైతులపై నమ్మకంతో రుణాలు అందిస్తున్నాయి

* ప్రవీణ్‌కుమార్, ఆముదాల వలస మండలం, శ్రీకాకుళం జిల్లా*:

– ‘రాష్ట్రప్రభుత్వం రైతుశ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన సున్నావడ్డీ రైతుల పాలిట వరం. దీనిద్వారా రైతులు సకాలంలో రుణాలు పొంది, తిరిగి జమ చేస్తున్నారు. దీనివల్ల రైతులకు, బ్యాంకులకు మధ్య నమ్మకం ఏర్పడింది. ముందు మందు మరింత పంట రుణాలను బ్యాంకులు ఇస్తాయి. నేను బ్యాంకుల నుంచి రూ.30 వేల పంట రుణం పొందాను. దాని కింద సుమారు రూ.1100 వడ్డీ రాయితీ నాకు ఇప్పుడు అందుతోంది. ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్ళకుండా బ్యాంకు నుంచే రుణం తీసుకునేందుకు ప్రోత్సాహకంగా వుంది. రైతుభరోసా కింద మే నెలలోనే రైతులందరికీ పెట్టుబడి అందించబోతున్నారు. ఈ డబ్బుతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మరెవ్వరినీ అప్పు అడగకుండానే ఆర్బీకెలో కొనుగోలు చేస్తాం. 

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురగుమందులు ఆర్బీకేల్లో అందుబాటులో వున్నాయి. పంట వేసిన నాటి నుంచి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు రైతుభరోసా కేంద్రాలు సాయం చేస్తున్నాయి. నేను నా పంటను అమ్ముకునేందుకు మొదట దళారీ వద్దకు వెళ్ళాను, ధాన్యం తడిచిపోయింది కాబట్టి కొనుగోలు చేయను అని అన్నాడు. తరువాత అదే ధాన్యాన్ని రూ.1490 కి ఆర్బీకె వద్ద కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. స్వర్గీయ వైయస్‌ఆర్‌ రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే.. ఆయన తనయుడిగా మీరు దానిని మెరుగుపరిచి తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారు’.

Comments