*ఈ నెల 8 న జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వ హణ కు సిద్ధం కండి*
*పోలింగ్ మెటీరియల్ ను, బ్యాలెట్ పేపర్ లను సరి చూసుకొండి*
*పోలింగ్ నిర్వహణ లో ఆర్ ఓ లదే పూర్తి బాధ్యత*
*రిసెప్షన్&డిస్ట్రుబ్యూషన్ సెంటర్ లలో భోజన వసతి ఏర్పాటు చేసి, ఓ ఆర్ ఎస్ పాకెట్స్ లు అందుబాటులో ఉంచండి: జిల్లా కలెక్టర్*
తిరుపతి, ఏప్రిల్ 5 (ప్రజా అమరావతి);
ఈ నెల 8 న జరగనున్న జెడ్పీటిసి,ఎంపి టిసి ఎన్నికల నిర్వహణ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ఎం.హరినారాయణన్ ఆర్ ఓ లు, ఏ ఆర్ ఓలు అయిన ఎంపిడిఓలు, తహసిల్దార్ లను ఆదేశించారు...
సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్డీవో కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి జిల్లా లో ఈ నెల 8 న జరగనున్న జెడ్పీటిసి,ఎంపి టిసి ఎన్నికల నిర్వహణ,ఈ నెల 10 న జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లు కు సంబంధించి ఆర్ ఓ లు, ఏ ఆర్ ఓలు అయిన ఎంపిడిఓలు, తహసిల్దార్ లతో సమీక్ష నిర్వహించారు...
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8 న జెడ్పీటిసి,ఎంపిటిసి ఎన్నికల నిర్వహణ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇందుకు పోలీసు శాఖ తో ఆర్ ఓ సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సులు రాత్రి 8 గంటల కు స్ట్రాంగ్ రూములకు చేరు కొని సీల్ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు..
పోలింగ్ మెటీరియల్ ను, బ్యాలెట్ పేపర్ లను సరి చూసుకోవాలని, పోలింగ్ నిర్వహణ లో ఆర్ ఓ లదే పూర్తి బాధ్యత అని ఏ ఆర్ ఓ లను ఆర్ ఓ లు సమన్వ యం చేసుకొని జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ను విజయవంతం చేయాలని ఎన్నికల విధుల్లో అలసత్వం పనికిరాదని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ లలో అవ సరమైన అన్ని ఏర్పాట్లు ఈనెల 6 వ తేది రాత్రికి పూర్తి కావాలని సూచిం చారు.రిసెప్షన్&డిస్ట్రుబ్యూషన్ సెంటర్ లలో భోజన వసతి ఏర్పాటు చేసి, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు లు అందు బాటులో ఉంచాలని తెలి పారు.కౌంటింగ్ కు సరి పడ్డ సిబ్బంది నియామ కం తో పాటు ఈ నెల 9 న శిక్షణ కార్యక్రమ నిర్వహించాలని ఈ శిక్షణ కార్యక్రమము ను సంబంధింత సబ్ కలెక్టర్, ఆర్డీవో లు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లు ఈ నెల 9 వతేది మధ్యాహ్నం నకు పూర్తి కావాలని..కౌంటింగ్ లో ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద మరియు డిక్లరేష న్ సమయంలో వీడియో గ్రఫీ తప్పనిసరి గా చేయాలని తెలిపారు...
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మదనపల్లి నుండి సబ్ కలెక్టర్ జాహ్నవి,చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షే మం) రాజశేఖర్, జిల్లా ఎన్నికల పరిశీలకులు శివ ప్రసాద్,డి ఆర్ వో మురళి, డి పి ఓ దశరథరామిరెడ్డి, జడ్పి సీఈఓ ప్రభాకర్ రెడ్డి ఇతర సంబంధింత అధి కారులు పాల్గొన్నారు..
addComments
Post a Comment