శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (prajaamaravathi)
: దేవస్థానం నందు ది.13-04-2021 నుండి ది.21-04-2021 వరకు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్న వసంత నవరాత్రులు ఉత్సవములలో 6 వ రోజు అనగా ది.18-04-2021 ఆదివారం రోజున ఆలయ అర్చక సిబ్బంది శ్రీ అమ్మవారికి కాగడా మల్లెపూలు, జాజులు మరియు మరువంతో ప్రత్యేక పుష్పఅర్చన నిర్వహించడం జరిగినది. శ్రీ అమ్మవారి పుష్పఅర్చన నిమిత్తం అవసరమైన పూలను గత 11 సంవత్సరములుగా అందజేయుచున్న దాత శ్రీ బడుగు వెంకటేశ్వర రావు గారు ఈ సంవత్సరం కూడా శ్రీ అమ్మవారి పుష్పఅర్చన నిమిత్తం అందజేశారు. తదుపరి రోజులలో జరుగు పుష్పఅర్చనలు ఈ క్రింది తెలిపిన పూలతో నిర్వహించబడును. ది.19-04-2021 : సోమవారం - ఎర్ర తామరలు, ఎర్ర గన్నేరు మరియు సన్న జాజులు. ది.20-04-2021 : మంగళవారం - పసుపు చామంతి, సంపెంగ పూలు. ది.21-04-2021 : బుధవారం - కనకాంబరాలు, మరియు ఎర్ర గులాబీ పూలు. పుష్పఅర్చన నిమిత్తం పూలు సమర్పించదలచుకున్న భక్తులు పై తేదీ ల యందు తెలిపిన విధముగా సదరు పై రోజులలో కొండపైన చిన్న రాజ గోపురం వద్ద ఏర్పాటు చేసిన పుష్పార్చన మండపం వద్ద ఉ.08 గం. ల లోపు పూలు సమర్పించవచ్చును. పై తేదీ లలో నిర్వహించే పుష్పార్చన సేవ(రూ.2500/- లు ఒక రోజునకు) యందు పాల్గొనదలచిన భక్తులు దేవస్థాన ఆర్జిత సేవ కౌంటర్ నందు పొందవచ్చును..
addComments
Post a Comment