కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఈ రోజు ఉదయం కర్నూలు నియోజకవర్గం వాలంటీర్ల సేవలకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం, 

కర్నూలు (prajaamaravathi); కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఈ రోజు ఉదయం కర్నూలు నియోజకవర్గం వాలంటీర్ల సేవలకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం,


సన్మాన వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కర్నూలు ఎంపీ డా.ఎస్.సంజీవ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఎస్.రేణుక, జేసీ(రెవెన్యూ) మరియు ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, కె.ఎం.సి.కమీషనర్ డీకే బాలాజీ, డిపిఓ ప్రభాకర్ రావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ భాస్కర్ నాయుడు తదితరులు.ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం మేరకు జగనన్న వారియర్స్ గా .. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ..గ్రామ గ్రామానా..వార్డు వార్డునా నవరత్నాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక లాంటి దాదాపు 40 ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల ఆర్థిక లబ్దిని, కోవిడ్ టైంలో కూడా సేవలను నిరుపేదల గడప వద్దకే సూర్యోదయం కంటే ముందే, సూర్యాస్తమయం తర్వాత కూడా అహర్నిశలు సేవా తత్పరతో, అవినీతి రహితంగా సేవ చేస్తూ.. పేద ప్రజల మనసు చూరగొన్న వాలంటీర్ల సేవలకు ప్రభుత్వ గుర్తింపుగా ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ నాడు వలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవాన్ని, సత్కారాలను రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఈ రోజు ప్రారంభించి ఈ నెల 25 వరకు వాలాంటీర్ సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది: ఎంపీ డా.ఎస్.సంజీవకుమార్, ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి.కర్నూలు జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపిక అయిన 16,621 మంది వలంటీర్లకు 'సేవా మిత్ర' పురస్కారం ద్వారా ప్రశంసా పత్రాలు, బ్యాడ్జి లను, ఒక్కొక్కరికి 10,000 ల రూపాయలు నగదు బహుమతిని అందిస్తున్నాము: ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి* *కర్నూలు జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపిక అయిన 327 మంది వలంటీర్లకు 'సేవా రత్న' పురస్కారం క్రింద ప్రశంసా పత్రాలు, బ్యాడ్జి లను, సిల్వర్ మెడల్, శాలువాతో పాటు ఒక్కొక్కరికి 20,000 ల రూపాయలు నగదు బహుమతిని అందిస్తున్నాము: ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి.కర్నూలు జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపిక అయిన 70 మంది వలంటీర్లకు 'సేవా వజ్ర' పురస్కారం క్రింద ప్రశంసా పత్రాలు, బ్యాడ్జి లను, గోల్డ్ మెడల్ ను, శాలువాతో పాటు ఒక్కొక్కరికి 30,000 ల రూపాయల నగదు బహుమతిని అందిస్తున్నాము: ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి* *అలాగే, జిల్లాలో మొత్తం 19185 మంది వాలంటీర్లకు ఉగాది పురస్కారం క్రింద బ్యాడ్జి లను ప్రదానం చేస్తాము: ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి* *కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు సునయన ఆడిటోరియం లో ఎంపీ డా.ఎస్.సంజీవ్ కుమార్ ముఖ్య అతిథిగా ప్రారంభించిన కర్నూలు నియోజకవర్గంకు సంబంధించి వలంటీర్ల సేవల సత్కార వేడుకల్లో 1684 మంది అర్బన్, రూరల్ వాలంటీర్లకు సేవా మిత్ర, 11 మంది వాలంటీర్లకు సేవా రత్న, 5 మంది వలంటీర్లకు సేవా వజ్ర ఉగాది పురస్కారాలను ఎంపీ డా.ఎస్.సంజీవ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఎస్.రేణుక, ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, కె.ఎం.సి.కమీషనర్ డీకే బాలాజీ, డిపిఓ ప్రభాకర్ రావ్ తదితరులు వలంటీర్ల సేవలను కొనియాడి..వలంటీర్ల కోలాహలం, హర్షధ్వానాలు, చప్పట్ల మధ్య ..ఉగాది పురస్కరాలతో వలంటీర్లను ఘనంగా సత్కరించారు* *ముఖ్యమంత్రి జగనన్న మంచి మనసున్న మారాజు..జగనన్న ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ను దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు కూడా మన ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పాలనును, వలంటీర్ల వ్యవస్థ ను ఆదర్శంగా తీసుకుంటున్నారు...........నిరుపేద ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘం..ఇదే సేవా తత్పరత ను కొనసాగించండి.. జగనన్న వారియర్స్ గా పేదలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ముఖ్యమంత్రి జగనన్న ప్రజలకు సేవ చేసే ఉజ్వల భవిష్యత్ ను వాలంటీర్లకు అందించారు..ముఖ్యమంత్రి జగనన్నకు వలంటీర్ల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు...నవరత్నాలపథకాల లబ్దిని పేదల గడప వద్దకే అందించడంలో.. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో వలంటీర్ల పాత్ర ఎంతో అభినందనీయం : ఎంపీ డా.సంజీవ్ కుమార్* *వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధి లాంటి వారు..అర్బన్ లో ప్రభుత్వ పథకాల అమలులో, కోవిడ్ టైం లో వలంటీర్లు అందించిన సేవలు ప్రశంసనీయం..వలంటీర్లు అందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి: కె.ఎం.సి.కమీషనర్ డీకే బాలాజీ.

Comments