ఉగాదికి శ్రీవారి ఆలయం ముస్తాబు.
తిరుమల (prajaamaravathi) : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ ఫ్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం, పరిసరాలను ఫల పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 8 టన్నుల సాంప్రదాయ పువ్వులు మరియు 70 వేల కట్ ఫ్లవర్స్‌తో పుష్పాలంకరణలు చేపట్టారు. ఇందులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నైపుణ్‌యం గల కళాకారులు భక్తులను ఆకట్టుకునేలా వినూత్నంగా అలంకరణలు చేస్తున్నారు. టిటిడి గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
addComments
Post a Comment